చరిత్ర సృష్టించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, 40 ఏళ్లలో ఒక్కడే, ముగ్గురే సీఎంలు!
Recommended Video

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చరిత్ర సృష్టించారు. ఐదు సంవత్సరాలు ఎలాంటి అటంకాలు లేకుండా పూర్తికాలం సీఎం గా పని చేసిన కర్ణాటక మూడవ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రికార్డు సృష్టించారు. అందులో 40 ఏళ్లలో ఐదు సంవత్సరాలు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక సీఎంగా సిద్దరామయ్య పేరు సంపాధించుకున్నారు.

2013 మే ఎన్నికలు
కర్ణాటకలో 2013 మే నెలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారీతో అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ అధిష్టానం ఆదేశాలతో 2013 మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు 2018 మే 12వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఐదు సంవత్సరాలు సీఎం
2013 మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సిద్దరామయ్య 2018 మే 15వ తేదీ వరకు సీఎంగా ఉంటారు. కన్నడిగులు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే సిద్దరామయ్య మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉంది.

40 ఏళ్ల క్రితం దేవరాజ అరసు
గత 40 ఏళ్లుగా కర్ణాటకలో ఐదు సంవత్సరాల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తిగా సిద్దరామయ్య నిలిచిపోయారు. 40 ఏళ్ల క్రితం (1972 నుంచి 1977 వరకు) కర్ణాటక ముఖ్యమంత్రిగా డి. దేవరాజ అరుసు మాత్రమే ఐదు సంవత్సరాల పూర్తికాలం సీఎంగా ఉన్నారు.

ఎస్ఎం. కృష్ణకు మిస్
1999లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆసమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం. కృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అండతో 2004 వరకు ఎస్ఎం. కృష్ణనే సీఎంగా ఉన్నారు. ఐదు సంవత్సరాల పూర్తి కాలం సీఎంగా ఉండే చాన్స్ ఉన్నా ఎస్ఎం. కృష్ణ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆయన ఐదేళ్ల పదవి కాలం పూర్తి చేసుకోలేకపోయారు.

ముగ్గురే సీఎంలు
కర్ణాటక చరిత్రలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవి కాలం పూర్తి చేసుకున్న వారు ముగ్గురే ఉన్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగించినా అది నిజం. కర్ణాటక చరిత్రలో ముగ్గురు మాత్రం ఐదు సంవత్సరాల సీఎం పదవిని అనుభవించారు. ఎస్. నిజలింగప్ప, డి. దేవరాజ అరసు తరువాత సిద్దరామయ్య తన పదవి కాలం పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications