కర్నాటక సీఎం సిద్ధూకు మేయర్ కవిత సానిల్ పంచ్‌లు! (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంగళూరు మేయర్ కవితా సానిల్‌లు కలియబడ్డారు! వారిద్దరు నిజంగా పంచ్‌లు ఇచ్చుకోలేదు.

మంగళూరు మేయర్ కవిత కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించారు. ఆమెతో సరదాగా ముఖ్యమంత్రి సిద్ధూ పంచ్‌లు విసురుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు

కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు

శనివారం మంగళూరులోని నెహ్రూ మైదానంలో ఇండియన్ కరాటే ఛాంపియన్‌షిప్ - 2017 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మేయర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోటీలను ప్రారంభించారు.

ఎంటర్ ది డ్రాగన్ చూశా, కరాటే రాదన్న సిద్ధూ

ఈ సందర్భంగా వారిద్దరు సరదాగా తలపడ్డారు. ఇది అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధూ మాట్లాడారు. కరాటే నేర్చుకోవడం ద్వారా మహిళలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. తనకు కరటే రాదని, బ్రూస్ లీ ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసి కొద్దిగా తెలుసుకున్నానని చెప్పారు.

మేయర్ కవిత గురించి

మేయర్ కవిత గురించి

అన్ని పాఠశాలల్లోను విద్యార్థులకు కరాటే నేర్పించాలని సిద్ధూ అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు నేర్పించాలన్నారు. మేయర్ కవిత గురించి కూడా సిద్ధూ మాట్లాడారు.

కవిత కరాటే ఛాంపియన్

కవిత కరాటే ఛాంపియన్

కవిత సానిల్ కరాటే ఛాంపియన్ అని తనకు తెలుసునని, ప్రతి అమ్మాయి కూడా ఇలాగే ఉండాలని, అప్పుడే క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలమని సిద్దూ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka chief minister Siddaramaiah and Mangaluru mayor Kavitha Sanil showed their karate moves at the inauguration of the Indian Karate Championship 2017 in the city on Saturday. Incidentally, Kavitha Sanil is a black belt in karate.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి