పార్లమెంట్ లో కలకలం, సీఎం ఏం చెప్పారంటే ?, 2001లో, 2023లో అధికారంలో బీజేపీ, ఏం జరిగింది ?
యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పార్లమెంట్ భవనంపై ఈరోజు జరిగిన ఈ దాడిని ఖండింస్తున్నామని, అంతేకాదు అత్యంత దిగ్భ్రాంతికరమన ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. దీనికి సంబంధించి సీఎం సిద్దరామయ్య బుధవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పార్లమెంట్ భవనంలోకి దుండగులు చొరబడటంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో ఎంపీలంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని తాను ఊపిరి పీల్చుకున్నానని సిద్దరామయ్య అన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడంతో తాను షాక్ అయ్యానని, ఈ సంఘటన భద్రతా వ్యవస్థలో పూర్తి వైఫల్యమని స్పష్టగా వెలుగు చూసిందని సిద్ధరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి సిద్దరామయ్య మనవి చేశారు. ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాన్ని దేశం ముందుంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందే అని, ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా బాధ్యత వహించి పూర్తి దర్యాప్తు ఆదేశాలు జారీ చెయ్యాలని సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇరవై రెండేళ్ల క్రితం అంటే 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి జరిగిన రోజునే మళ్లీ ఇలాంటి దాడి జరగడం వల్ల దీని వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2001 దాడుల సమయంలో కూడా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉందని అందరూ గమనించాలని అంటున్నారు.

దీంతో దేశ భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్లమెంట్ భవనంపై దాడి చేసిన యువకులకు మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో పాస్ లు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమైతే బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను కూడా విచారణ చెయ్యాలని కర్ణాటకకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
లోక్ సభలో ఎంట్రీకి పాస్ ఇవ్వాలంటే యువత బీజజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు పరిచయస్తులు అయి ఉండాలి, పరిచయస్తులు కాకుంటే అపరిచిత వ్యక్తులకు పాస్‌లు ఎలా ఇచ్చారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. చట్టంలో బాధ్యతారాహిత్యం వల్ల జరిగే విపత్తు కూడా శిక్షార్హమేనని తెలుసుకోవాలి అని అంటున్నారు. భారతదేశానికి గుండెకాయ లాంటి పార్లమెంట్ హౌస్ లోకి దుండగులు చొరబడటం కలకలం రేపింది.

పార్లమెంట్ భవనం చుట్టపక్కల చాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే ఈ యువకులు స్మోక్ బాంబులు పట్టుకుని పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారు? ఈ చర్యలో అంతర్గత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ యువకుల చర్య వెనుక వేరే శక్తులు ఉన్నాయా? లాంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయని ప్రజలు అంటున్నారు.
దేశంలోని పార్లమెంటు భవనమే సురక్షితంగా లేనప్పుడు, దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాపై ఉందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications