కల్నల్ నిరంజన్: రూ. 30 లక్షలు పరిహారం: సిద్దూ
బెంగళూరు: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులకు రూ. 30 లక్షలు పరిహారం అందిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు.
సోమవారం ఉదయం బీఇఎల్ మైదానం చేరుకున్న సీఎం సిద్దరామయ్య నిరంజన్ కుమార్ కు నివాళులు అర్పించారు. అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 30 లక్షలు పరిహారం అందిస్తామని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులకు అన్ని విధాలఆదుకుంటామని హామి ఇచ్చారు. నిరంజన్ కుమార్ కుటుంబంలోనే ఇద్దరు దేశం కోసం పోరాడుతున్నారని, అయితే దురదృష్టవశాత్తు నిరంజన్ కుమార్ మరణించారని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
ఇదే సందర్బంలో నిరంజన్ కుమార్ కుటుంబ సభ్యులను సిద్దరామయ్య ఓదార్చారు. పలు పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రముఖులు లెప్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ కు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications