Karnataka Budget 2025: రూ.4,08,647 కోట్లతో కర్టాటక బడ్జెట్‌.. కేటాయింపులు ఇవే..

Karnataka Budget 2025: 2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.4,08,647 కోట్ల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సభ ముందుకు తీసుకువచ్చారు. మైనారిటీల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, ఇతర రంగాలకు ఈ బడ్జెట్ లో అనేక ముఖ్యమైన కేటాయింపులు చేయబడ్డాయి. 'ముఖ్యమంత్రి మైనారిటీ కాలనీ అభివృద్ధి కార్యక్రమం' కింద రూ.1000 కోట్లతో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇది 2025-26లో అమలు చేయబడుతుంది. వక్ఫ్ ఆస్తుల మరమ్మతు, ముస్లిం శ్మశాన వాటికల రక్షణ కోసం రూ. 150 కోట్లు కేటాయించారు. ఆర్ధికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలలో సాధారణ వివాహాలను ప్రోత్సహించడానికి ప్రతి జంటకు రూ.50,000 సహాయం అందించబడుతుంది.

బడ్జెట్ లో జైన పూజారులు, సిక్కుల ప్రధాన గ్రంథీలు, మసీదుల పేష్-ఇమామ్ ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.6000కి పెంచారు. అసిస్టెండ్ గ్లాండ్స్, ముజ్జిన్ల గౌరవ వేతనం నెలకు రూ.5000గా నిర్ణయించబడింది. కేటగిరీ 2బీకి చెందిన మైనారిటీ కాంట్రాక్టర్లు ఇతర వర్గాల మాదిరిగానే రూ.2 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్టులను పొందుతారు.

Karnataka CM Siddaramaiah Presents Rs 4 9 Lakh Crore Budget in Assembly
బెంగళూరులో మౌలిక సదుపాయాల కోసం..
*నగరంలో సొరంగ రహదారుల నిర్మాణానికి రూ.19,000 కోట్లు కేటాయింపు
*డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ను రూ.8,916 కోట్లతో నిర్మించనున్నారు.
*బ్రాండ్ బెంగళూరు ప్రాజెక్టుకు రూ. 1,800 కోట్లు కేటాయింపు.
*40.5 కి.మీ పొడవైన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించబడుతుంది.
*బెంగళూరు సేఫ్ సిటీ ప్రాజెక్టును రూ 660 కోట్ల వ్యయంతో అమలు చేశారు. 7,500 కెమెరాలు, డ్రోన్లు, 60 బాడీ-వోర్న్ కెమెరాలను అందించారు.

మహిళా సాధికారత కోసం..
*10 పట్టణ ప్రాంతాల్లోని ఇందిరా క్యాంటీన్లను జాతీయ జీవనోపాధి మిషన్ మహిళా స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తాయి.
*జిల్లా, తాలూకా పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో 'అక్కా కేఫ్ అండ్ క్యాంటీన్' ఏర్పాటు చేయబడుతుంది.

సినిమా, వినోదం ప్రోత్సాహం కోసం..
సినీ రంగానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను సిద్ధరామయ్య సర్కారు సభ ముందుకు తీసుకువచ్చింది. కన్నడ సినిమాలను ప్రోత్సహించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను రూపొందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలో గరిష్ట టికెట్ ధరను రూ.200గా నిర్ణయించారు.మల్టీఫ్లెక్స్ లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. సామాన్యులకు సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మైసూర్ లో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ. 500 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

ఆర్థిక సమతుల్యత, పన్ను సంస్కరణలు
కర్ణాటక ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ హామీ పథకాల కోసం రూ. 51,034 కోట్లు కేటాయించింది. ఇది జీఎస్డీపీలో 3 శాతం. జీతాలు, వేతన జీవులపై పన్నును రూ.200 నుంచి రూ.300కి పెంచడానికి ప్రొఫెషనల్ ట్యాక్స్ చట్టాన్ని సవరించనున్నారు. వార్షిక గరిష్ట పరిమితిని రూ.2,500గా నిర్ణయించనున్నారు.

నక్సలిజంపై ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రభుత్వ హయాంలో 6 మంది నక్సలైట్లు లొంగిపోయారు. కర్ణాటక నక్సల్ రహితంగా మారినందున నక్సల్స్ వ్యతిరేక దళాన్ని రద్దు చేస్తారు. లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసం కోసం ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.10 కోట్లతో ప్రణాళికను రూపొందించనున్నారు. బడ్జెట్ లో ప్రకటించిన ఈ పథకాలు రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమానికి, బెంగళూరు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+