దిక్కు దిమానం లేని బీజేపీ, ప్రధాని మోదీ పేరు చెప్పుకుని ఎన్ని రోజులు బతుకుతారు?

బెంగళూరు: విశ్వగురువు అని ప్రధాని నరేంద్ర మోదీ గురించి బీజేపీ గొప్ప ప్రసంగం చేస్తుంది. విశ్వగురువు తమ పార్టీలో ప్రతిపక్ష నేతను ఎన్నుకోలేకపోతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై విరుచుకుపడ్డారు. గురువారం శాసన సభలో బడ్జెట్‌పై వివరణ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య ప్రధాని మోదీ మీద మండిపడ్డారు. సీఎం సిద్దరాయయ్య మాట్లాడుతూ తాను కర్ణాటకలో పద్నాలుగు సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టాను అని అన్నారు.

మొదటి సారి ప్రతిపక్షం లేకుండా సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడిందని, ఇది చాలా బాధాకరం అని. కర్ణాటక చరిత్రలో ఇలాంటి ప్రతిపక్ష నాయకుడులేని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఇది బీజేపీ తీరు అని సిద్దరామయ్య మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యమైన అంశాలని, ప్రతిపక్ష నేత లేకుండా చర్చ జరగడం ఇదే తొలిసారి అని సిద్దరాయ్య అన్నారు.

 Karnataka CM Siddaramaiah questioned if Prime Minister Narendra Modi is the only big direction for BJP

నేను 1983 నుంచి కర్ణాటక అసెంబ్లీలో ఉన్నాను. ఇలా జరగడం ఇదే తొలిసారి, బీజేపీ ఇప్పటికే రాజకీయంగా దివాళా తీసింది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, రాజ్యాంగంపై, పార్లమెంటుపై విశ్వాసం లేదు, అయినా బీజేపీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. అన్ని పార్టీలు రాజ్యాంగ పరిధిలో పని చేయాలి అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగం ఆశయాలను కాపాడాలి. బడ్జెట్‌పై ప్రతిపక్షం లేకుండా సమాధానం చెప్పడం ఇదే తొలిసారి. నా ఎదురుగా ఒక్క సభ్యుడు కూడా లేకుండా ఖాళీగా ఉన్న సీట్లకు సమాధానం చెప్పడం చాలా బాధాకరం అంటూ బీజేపీపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. మా హామీలతో విసిగిపోయిన బీజేపీకి డ్యూటీ కంటే రాజకీయం ఎక్కువ. బీజేపీ వాళ్లు రాజకీయాలు చేయనివ్వండి, ఎంత రాజకీయం చేసినా పర్వాలేదు, వాళ్లకు మా హామీ నినాదాలు మొదలయ్యాయి కాబట్టి, కడుపు మంట మొదలైందని సిద్దరామయ్య అన్నారు.

బీజేపీ ఒక మతతత్వ శక్తి, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే శక్తి. బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాకూడదు, ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉండాలి, నేను బీజేపీ ముక్త భారత్ వాలని, బీజేపీ ముక్త కర్ణాటక కావాలని చెప్పానని, కర్ణాటక నుంచి బీజేపీ పతనం మొదలైందని, బీజేపీ మోదీపై మాత్రం ఆధారపడి ఉందపి, మోదీ చరిష్మా రోజురోజుకు మసకబారుతోందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+