కేంద్ర మంత్రి అయితే సరిపోదు: ఆలోచించాలి: కర్ణాటక సీఎం ఫైర్, బెంగళూరులో వరదలకు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య విషయంలో కేంద్ర న్యాయవ్యహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బాధ్యతలేని విధంగా మాట్లాడుతున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ పోలీసుల సహాయం కావాలి: కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, కర్ణాటక పోలీస్!

గౌరి లంకేష్ కు ప్రాణ బెదిరింపులు ఉన్నట్లు కర్ణాటక ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఆమె ఒక్కసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. గౌరి లంకేష్ భద్రత కావాలని కోరి ఉంటే కచ్చితంగా ఆమెకు భద్రతా ఏర్పాట్లు చేసేవారమని సీఎం సిద్దరామయ్య వివరించారు.

Karnataka CM slams Ravi Shankar Prasad for comments over journalist

గౌరీ లంకేష్ కు ప్రాణహాని ఉందని తెలిసినా కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎలా మాట్లాడుతారని సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ అధికారుల దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకం ఉందని, గౌరీ లంకేష్ హత్య కేసులో త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: హంతకుల ఆచూకి ఇస్తే రూ. 10 లక్షలు: రామలింగా రెడ్డి !

బెంగళూరులో భారీ వర్షాల కారణంగా వరద నష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అనంతకుమార్ కావాలనే నిందలు వేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. భారీ వర్షాల కారణంగా జరుగుతున్న నష్టాలకు మా మీద నిందలు వేసి రాజకీయం చేస్తున్నారని, ఇది మంచి పద్దతికాదని సీఎం సిద్దరామయ్య కేంద్ర మంత్రి అనంతకుమార్ కు సూచించారు. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపణలుకు ఇప్పటికే కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka CM Siddaramaiah on Sunday slammed Union Law Minister Ravi Shankar Prasad for accusing the state government of failure to give protection to slain journalist Gauri Lankesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి