Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డీకే శివకుమార్ vs సిద్ధరామయ్య: ఎవరి బలమెంత?

DK Shivakumar vs Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. అయితే ఈ రెండు వర్గాలలో ఎవరి బలం ఎక్కువ అనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఆయన వైపే మొగ్గు చూపుతున్న సీఎం సీటు
ప్రస్తుతానికి సీఎం సిద్ధరామయ్య పదవికి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. కర్ణాటక రాష్టంలో ఓబీసీలదే రాజ్యమని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసని నివేదికలు చెబుతున్నాయి ఆయనకు అహింద వర్గంతో పాటు పార్టీలోని 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సభలో మొత్తం 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య అంగీకారం లేకుండా ముఖ్యమంత్రిని మార్చడం అనేది చాలా కష్టం.

Karnataka Congress Power Struggle Who Is Stronger DK Shivakumar or Siddaramaiah

కాంగ్రెస్‌కు హెచ్చరిక
కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య (KSFBCC) కాంగ్రెస్‌ను హెచ్చరించింది. రాష్ట్ర యూనిట్‌లో అంతర్గత కలహాల నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించడానికి ఏ ప్రయత్నం చేసినా అది పార్టీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటక రాష్ట్ర వొక్కలిగ సంఘం కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌కు అన్యాయం జరిగితే.. వారు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించింది.

జి.పరమేశ్వర్ పేరును ముందుకు తెచ్చే అవకాశం
ముఖ్యమంత్రిని మార్చాలని సిద్ధరామయ్య వర్గంపై ఒత్తిడి తెస్తే వారు అధిష్ఠానానికి పేర్ల జాబితాను సమర్పిస్తారని గత కొద్ది రోజులుగా మీడియా నివేదికలలో వెల్లడైంది. ఇందులో ఓ ప్రత్యామ్నాయంగా హోంమంత్రి జి.పరమేశ్వర్ పేరు ఉండవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సిద్ధరామయ్య వర్గం ఏ పరిస్థితులలోనూ డీకే శివకుమార్‌ను తమ బాస్‌గా అంగీకరించడానికి సిద్ధంగా లేదు.

వొక్కలిగ మఠం నుంచి డీకే శివకుమార్‌ను సీఎం చేయాలనే డిమాండ్
వీటన్నింటి మధ్య వొక్కలిగ వర్గానికి చెందిన ప్రముఖ మఠం ఆదిచుంచనగిరి మఠం రంగంలోకి దిగింది. ఆదిచుంచనగిరి మఠం ప్రధాన పూజారి నిర్మలానంద నాథ స్వామి మాట్లాడుతూ.. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రాష్ట్ర అత్యున్నత పదవిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన అల్టిమేటం కూడా ఇచ్చారు. టీవీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాను నిరంతరం చూస్తున్నానని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+