నిర్దోషిగా వస్తా, మళ్లీ మంత్రినవుతా: కాంట్రాక్టర్ హత్య కేసుపై మంత్రి ఈశ్వరప్ప, రాజీనామా

బెంగళూరు: కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను శుక్రవారం సాయంత్రం సీఎం బసవరాజ్ బొమ్మైకి అందజేయడానికి ముందు శివమొగ్గలో ఆయన తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.

తనపై కుట్రలో భాగంగా వస్తోన్న ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడతాననీ, మళ్లీ మంత్రి కూడా అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి పదవికి రాజీనామా చేయొద్దంటూ ఈశ్వరప్ప అనుచరులు, కార్యకర్తలు కోరారు. కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు వచ్చాయని, వీటి నుంచి తాను బయటపడాలంటే నిర్దోషిగా రుజువు కావాల్సి ఉంటుందన్నారు ఈశ్వరప్ప.

Karnataka Contractor Death Case: Eshwarappa, Says Will Come Out Innocent, Become Minister Again

ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు మంత్రిగా ఉంటే దర్యాప్తును తాను ప్రభావితం చేశాననే భావన ఏర్పడుతుందనీ.. అందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈశ్వరప్ప తెలిపారు. ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తాననీ, మళ్లీ తప్పకుండా మంత్రి అవుతానని ఈశ్వరప్ప ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితి తనకు ఓ అగ్ని పరీక్ష లాంటిందని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కుట్రలో భాగంగానే తనపై అనేక మంది ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర నుంచి బయటపడతానని అన్నారు. సీఎంకు రాజీనామా లేఖను సమర్పిస్తున్నట్లు తెలిపారు. తానెంతగానో అభిమానించే మాజీ సీఎం యడ్యూరప్ప, సీఎం బొమ్మై, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల మద్దతు చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు.

కాగా, మంత్రి ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఇటీవల ఆరోపించిన కాంట్రాక్టర్ మూడు రోజుల క్రితం అనుమానాస్పాద స్థితిలో మృతి చెందారు. ఈశ్వరప్ప కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మీడియా సంస్థలకు పాటిల్ సందేశాలు పంపించారు. ఈ ఘటనపై మంత్రి ఈశ్వరప్ప ఆరోజే స్పందించారు. తనకు ఏమీ తెలియదని అన్నారు. సదరు కాంట్రాక్టర్ తనను కలవలేదన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు పరువునష్టం దావా వేశారు. కాగా, కాంట్రాక్టర్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు.. మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా మంత్రి ఈశ్వరప్ప రాజీనామామా చేయాలని డిమాండ్ చేశాయి.

రాజీనామాను సీఎంకు సమర్పించిన మంత్రి ఈశ్వరప్ప

కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలపై కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్(RDPR) మంత్రి కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన రాజీనామాను సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+