మహిళా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కు అరెస్టు వారెంట్ జారీ చేసిన ప్రత్యేక కోర్టు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భూ కబ్జా, భూ స్వాధీనం విచారణ కేసులో కర్ణాటకలోని ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కు ప్రత్యేక న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. భూకబ్జా, భూస్వాధీనం విషయంలో సంపూర్ణ వివరాలు కోర్టుకు సమర్పించడంలో విఫలం అయ్యారని ఉడిపి జిల్లా మహిళా కలెక్టర్ కు అరెస్టు వారెంట్ జారీ చేశారు.

కర్ణాటక భూకబ్జా నిషేద చట్టం కింద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఉడిపి జిల్లాలోని భూకబ్జా, భూస్వాధీనం విషయంలో పూర్తి వివరాలు సమర్పించడంలో స్థానిక తాలుకా తహసిల్దార్ విఫలం అయ్యారు. కోర్టుకు వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Karnataka court issues arrest warrant against Udupi DC Priyanka Mary Francis

న్యాయస్థానం ఆదేశాలు లెక్కచెయ్యకుండా వివరాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. మంగళూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి అరెస్టు వారెంట్ చేరింది. మంగళూరు ఎస్పీ వారెంట్ ను ఉడిపి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. ఈనెల 13వ తేదీ జిల్లా కలెక్టర్ స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The special court of Bengaluru which is formed to deal with land encroachment cases has issued an arrest warrant against Udupi DC Priyanka Mary Francis.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి