వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: టోల్ గేట్ లో రూ.40 కు రూ. 4 లక్షలను డ్రా, బాధితుడిలా...

కర్ణాటక రాష్ట్రంలోని టోల్ గేట్ సిబ్బంది కార్డును స్వైప్ చేసి రూ.40 కి బదులుగా రూ. 4 లక్షలను డ్రా చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మంగళూర్: రూ. 40 బదులుగా రూ. 4 లక్షలు డ్రా చేశారు.నగదు రహిత లావాదేవీల వైపుగా కేంద్రం ప్రజలను ప్రోత్సహిస్తోంది.అయితే నగదు రహిత లావాదేవీల సమయంలో ఏమరుపాటుగా ఉంటే మోసపోకతప్పదు. ఓ టోల్ గేటు వద్ద రూ.40 కోసం కార్డ్ స్వైప్ చేస్తే రూ. 4లక్షలను డ్రా చేశారు టోల్ గేటు నిర్వహకులు.దీంతో డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు.

కర్ణాటక రాష్ట్రంలోని గుండ్మి టోల్ గేట్ వద్ద మైసూర్ కు చెందిన ఓ డాక్టర్ రావు తీరప్రాంతం మీదుగా ముంబాయికి వెళ్తున్నాడు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి సమీపంలోని గుండ్మిటోల్ గేట్ వద్ద టోల్ పీజు చెల్లించేందుకుగాను తన డెబిట్ కార్డును స్వైప్ చేశాడు.

టోల్ గేట్ ఫీజు రూ.40 చెల్లించేందుకుగాను టోల్ గేట్ వద్ద పనిచేసే ఉద్యోగికి తన డెబిట్ కార్డును ఇచ్చాడు. టోల్ గేట్ ఉద్యోగి డాక్టర్ రావుకు పిఓసి రశీదు కూడ ఇచ్చాడు.

Karnataka doctor's card swiped for Rs 4 lakh instead of Rs 40 at toll booth

కాని, డాక్టర్ రావు మొబైల్ కు వచ్చిన మేసేజ్ లో మాత్రం రూ.4 లక్షలు తన ఖాతా నుండి డ్రా చేసినట్టుగా మేసేజ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన వెంటనే టోల్ గేట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళాడు. అయితే వారు మాత్రం ఈ విషయంలో తమ తప్పిదమేమీ లేదన్నారు.

దీంతో డాక్టర్ రావు టోల్ గేట్ సిబ్బందిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టోల్ గేట్ సిబ్బందిని ప్రశ్నిస్తే అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు. దీంతో డాక్టర్ కు తన నగదుతో పాటుగా అదనంగా కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు టోల్ గేట్ సిబ్బంది ఆఫర్ చేశారు.అయితే తన ఖాతా నుండి డ్రా అయిన రూ. 4 లక్షల రూపాయాలనే ఆయన తీసుకొన్నాడు.

English summary
A groggy toll attendant swiped Rs 4 lakh instead of Rs 40 from a doctor's debit card at Gundmi toll gate on the Kochi-Mumbai National Highway near Udupi around 10.30pm Saturday. The toll gate is 18kms from Udupi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X