వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్: ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానం, ఫిర్యాదుకు రెఢీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Assembly Elections 2018 Result Updates (Video)

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సందర్భంగా మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరమీదికి వచ్చింది. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఓటమి పాలైన ఏడుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి ఈ విషయమై మంగళవారం నాడు అనుమానాలను వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎంల)పై సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పుడు పోల్స్ ను బ్యాలట్ విధానంలో నిర్వహించడానికి బీజేపీకి ఉన్న సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Karnataka Election result 2018: Congress cries foul alleges EVM tampering

మొదటి నుంచీ నేను చెబుతూనే ఉన్నా. దేశంలో ఈవీఎంలపై సందేహాలు లేవనెత్తని రాజకీయ పార్టీయే లేదు. బీజేపీ కూడా గతంలో సందేహాలు వ్యక్తం చేసిందని మోహన్ ప్రకాష్ గుర్తు చేశారు. . ప్రజలు ఒక పార్టీకి ఓటేస్తే, అవి మరో పార్టీకి వెళుతున్నాయని, ఎందుకంటే కర్ణాటకలో పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు.

దక్షిణ కర్ణాటకలో ఓటమి పాలైన 7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు కూడ ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ విషయమై పూర్తి వివరాలతో బుధవారం నాడు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
Amidst the counting of votes for the Karnataka Assembly elections wherein the Bharatiya Janata Party (BJP) has taken a clear lead, the Congress on Tuesday alleged that electoral process was rigged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X