కుమారస్వామి కీలక ప్రకటన చేస్తారు!: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్-జేడీఎస్ నేతలు

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి కోరారు. జేడీఎస్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రకటన చేయడంతో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే.

అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌కు 78 స్థానాలు రావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో చివరకు జేడీఎస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. జేడీఎస్‌ అధినేత కుమారస్వామి కూడా గవర్నర్‌ను కలిశారు. ఇప్పటికే జేడీఎస్‌ నేతలు కొందరు గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కుమారస్వామి కీలక ప్రకటన చేస్తారని నేతలు చెబుతున్నారు.

Karnataka election results 2018 LIVE: Kumaraswamy meets Governor, stakes claim to form govt

గవర్నర్‌ను కలిసిన అనంతరం కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు పరమేశ్వర, సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ నిర్ణయం మేరకు తాము జేడీఎస్‌కు మద్దతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వరలు తెలిపారు. కుమారస్వామికి తాము బేషరతుగా మద్దతిస్తున్నామని చెప్పారు. తాము రాతపూర్వకంగా మద్దతు ఇస్తున్నట్లు గవర్నర్‌కు తెలిపామన్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని తాము గవర్నర్‌ను కోరామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+