వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక రిజల్ట్స్: మోడీ మానియాతో కాంగ్రెస్‌కు దెబ్బ, సంబరాల్లో బిజెపి

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బిజెపికి అనుకూలంగా కన్పిస్తున్నాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగినా ఆ తర్వాత బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సుమారు వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్ధులు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలోని పలు సభల్లో ప్రసంగించిన మోడీ స్థానిక సమస్యలను ప్రస్తావించారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరించాయనే దాన్ని వివరించారు.

గడగ్ జిల్లాలో మహదాయి నది నీటి వివాదం గోవా, కర్ణాటక రాష్ట్రాల మధ్య 2002 నుండి కొనసాగుతోంది. మూడేళ్ళుగా సుమారు మూడు జిల్లాల రైతాంగం ఈ నదీ జలాల వివాదం విషయంలో ఆందోళన చేస్తున్నారు.

Karnataka Election Results 2018 LIVE: Modi Mania? BJP crosses half-way mark in leads, celebrations begin

అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ సమస్యను కర్ణాటకలో ఏర్పాటు కాబోయే బిజెపి ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఓటర్లకు నమ్మకం కల్గించారు. అదే విధంగా గోవాలో , కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఈ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు గోవా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహదాయి నది జలాల పంపకం విషయంలో ఆనాడు చేసిన ప్రసంగాలను కూడ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో నెట్టిన విషయాన్ని తన ప్రసంగాల్లో ప్రస్తావించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను కూడ సక్రమంగా వినియోగించలేదని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

మరోవైపు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బూత్ లెవల్ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పనితీరు ఈ ఎన్నికల్లో పనిచేసిందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ఫలితంగా కాంగ్రెస్ కంటే బిజెపి అభ్యర్ధులు ముందంజలో ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

English summary
According to leads, BJP is now well past the halfway mark of 112 and has won single largest majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X