వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఓడిపోతున్నా: కర్నాటక ఓట్ల లెక్కింపు టైంలో బీజేపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోతున్నానని చెన్నపట్టణ బీజేపీ అభ్యర్థి యోగీశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కుమారస్వామిని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Live: కర్ణాటక ఎన్నికల ఫలితాలు: బాదామి, చాముండేశ్వరిలో వెనుకంజలో సీఎం సిద్ధరామయ్య <br>Live: కర్ణాటక ఎన్నికల ఫలితాలు: బాదామి, చాముండేశ్వరిలో వెనుకంజలో సీఎం సిద్ధరామయ్య

ఆ రెండు పార్టీలు బ్లాక్ మనీని భారీగా వెదజల్లాయన్నారు. రెండు పార్టీలు తనపై కలిసిపోయి కుట్రతో ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఓడిపోతున్నానని యోగేశ్వర చెప్పారు.

Karnataka Election Results 2018 Updates: BJP leader hot comments

రామనగరలో జేడీఎస్ నేత కుమారస్వామి ముందంజలో ఉన్నారు.
చాముండేశ్వరిలో సిద్ధరామయ్య వెనుకంజలో ఉండగా, జేడీఎస్ నేత దేవేగౌడ ముందంజలో ఉన్నారు. బాదామిలోను సీఎం సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు.

ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.. ప్రధాన పక్షాలు కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌లలో ఏ పార్టీకి కన్నడ ప్రజలు పట్టం కట్టారనేది మధ్యాహ్నానికల్లా వెల్లడి కానుంది.

ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలను బట్టి కర్నాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కింగ్‌ మేకర్‌గా నిలిచే అవకాశముందని తెలుస్తోంది. హంగ్‌ ఏర్పడితే జేడీఎస్ ఎటు వైపు మొగ్గు చూపితే వారికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి.

English summary
Counting underway in 222 of 224 Assembly seats in Karnataka. While most exit polls have predicted a hung Assembly, it remains to be seen if the BJP can wrest power from the Siddaramaiah-led Congress in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X