వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఫలితాలు: అతిపెద్ద పార్టీగా బీజేపీ, తగ్గిన కాంగ్రెస్, జేడీఎస్‌కు పెరగలేదు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్‌ను కలిశారు.

బీజేపీ: గెలుపు: 104

కాంగ్రెస్: గెలుపు: 078

జేడీఎస్: గెలుపు: 038

ఇతరులు: గెలుపు: 002

కాగా, 2019లో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత నెలకొంది. అందుకే భారతీయ జనతా పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కూడా తీవ్రంగా గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయి.

Recommended Video

    Karnataka Elections 2018 : Bjp Will Win Karnataka Elections : Survey
     karnataka election results trends 2018 live updates

    కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగ్గా.. నేడు ఫలితాలు వెలువడ్డాయి. లెక్కింపు కోసం 38 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

    Newest First Oldest First
    6:27 PM, 15 May

    ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యడ్యూరప్పకు వారం రోజుల గడువు ఇచ్చారు కర్ణాటక గవర్నర్.
    5:25 PM, 15 May

    జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి కూడా గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారు. కాంగ్రెస్ తమకు మద్దతిస్తుందనే లేఖతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోరనున్నారు.
    5:09 PM, 15 May

    కాగా, రేవణ్ణతోపాటు 12మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు తమకుందని చెబుతూ బీజేీీపీ సీఎం అభ్యర్తి యడ్యూరప్ప.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరారు.
    5:07 PM, 15 May

    చామరాజ్‌నగర్‌లో వటల్ నాగరాజు డిపాజిట్లను కోల్పోయారు.
    5:06 PM, 15 May

    జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిప్యూటీ సీఎం పదవి లభించే అవకాశం ఉంది.
    5:04 PM, 15 May

    జేడీఎస్ నేతలు కుపేంద్ర రెడ్డి, రమేష్ బాబు, శ్రవణ్‌లు గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారు.
    5:00 PM, 15 May

    స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ తమతోనే ఉన్నారని కాంగ్రెస్ నేత శివకుమార్ చెప్పారు.
    4:59 PM, 15 May

    జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జేడీఎస్‌కు 14, కాంగ్రెస్‌కు 12మంత్రి పదవులను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
    4:57 PM, 15 May

    ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.
    4:56 PM, 15 May

    గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన జేడీఎస్.
    4:16 PM, 15 May

    అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని యడ్యూరప్ప ఆరోపించారు.
    4:16 PM, 15 May

    కర్ణాటక ప్రజలు కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటున్నారని, అందుకే తమ పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా గెలిపించారని యడ్యూరప్ప చెప్పారు. ఇందుకు కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలని చెప్పారు.
    4:14 PM, 15 May

    కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు.
    4:01 PM, 15 May

    కర్ణాటక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బీజేపీ అధిష్టానంతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సీఎం అభ్యర్థి యడ్యూరప్ప తెలిపారు.
    3:59 PM, 15 May

    స్పష్టమైన మెజార్టీకి కొద్దదూరంలో బీజేపీ ఆగిపోవడంతో మల్లేశ్వరంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు ఆగిపోయాయి.
    3:58 PM, 15 May

    దేవెగౌడతో బీజేపీ నేతలు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుపుతోంది. అయితే, దేవెగౌడ కాంగ్రెస్ పార్టీతో వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
    3:57 PM, 15 May

    హరప్పనహళ్లి నియోజకవర్గం నుంచి గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు, బీజేపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి గెలుపొందారు. కాడూరు నియోజకవర్గంలో జేడీఎస్ సీనియర్ నేత వైయస్వీ దత్తా ఓడిపోయారు.
    3:55 PM, 15 May

    కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ను జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి అంగీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
    3:51 PM, 15 May

    జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము మద్దతిస్తామని, ముఖ్యమంత్రి పదవిని కూడా జేడీఎస్ అధినేతలే నిర్ణయిస్తారని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
    3:49 PM, 15 May

    మంగళవారం సాయంత్రం 4గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు సీఎం సిద్ధరామయ్య వెళ్లనున్నారు.
    3:47 PM, 15 May

    జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు.
    3:46 PM, 15 May

    కర్ణాటకలో బీజేపీ విజయం పార్టీ కార్యకర్తలదేనని, అత్యధిక సీట్లు కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
    3:45 PM, 15 May

    జేడీఎస్, కాంగ్రెస్ కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు.
    3:44 PM, 15 May

    తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీరుసెల్వం కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని స్వాగతించారు. దక్షిణ భారతదేశంలో ప్రవేశించిన బీజేపీకి స్వాగతమంటూ అమిత్ షాకు ఆయన లేఖ రాసి అభినందనలు తెలిపారు.
    3:42 PM, 15 May

    గెలుపొందిన జేడీఎస్ అభ్యర్థులు దేవెగౌడ, కుమారస్వామిలను కలిసేందుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చర్చించనున్నారు.
    3:41 PM, 15 May

    యశ్వంత్‌పురలో బీజేపీ అభ్యర్థి, సినీ నటుడు జగ్గేశ్ ఓటమిపాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది.
    3:40 PM, 15 May

    చిక్‌పేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్ గురుదాచార్ గెలుపొందారు.
    3:39 PM, 15 May

    అవినీతి, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రతినిధిగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.
    3:36 PM, 15 May

    సిర నియోజకవర్గంలో న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర ఓటమిపాలయ్యారు. జేడీఎస్ అభ్యర్థి సత్యనారాయణ ఆయనపై గెలుపొందారు.
    3:12 PM, 15 May

    కొన్ని మీడియా ఛానళ్ల కథనం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
    READ MORE

    English summary
    The wait is over. The result of Karnataka assembly elections 2018, which was dubbed as the biggest political battle of the year, would be declared today (May 15) and you can catch all the live action here.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X