India Today exit polls: హైదరాబాద్-కర్ణాటకలో ఆ పార్టీదే హవా- క్లీన్ స్వీప్‌కు ఛాన్స్

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింసింది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69 మేర పోలంగ్ శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సీల్ వేశారు.

ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును షెడ్యూల్ అయింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఆరంభం అయ్యాయి. వివిధ న్యూస్ ఛానళ్లు ఇదివరకే తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ క్రమంగా వెలువడిస్తోన్నాయి. ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ పార్టీకి పట్టం కట్టారనే విషయంపై అంచనాలను విడుదల చేస్తోన్నాయి. ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం- ఏ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంపై ప్రజాభిప్రాయాన్ని వెల్లడిస్తోన్నాయి.

Karnataka assembly elections 2023

ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం- సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. మొత్తం 41 స్థానాలను హస్తం పార్టీకి లభిస్తాయి. ఈ రీజియన్‌లో 35 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలుస్తుంది. జనతాదళ్ (సెక్యులర్)- 17 స్థానాలకు పరిమితమౌతుంది. ఇతరులు ఏడు స్థానాలను దక్కించుకుంటారు. కరావళి కర్ణాటక అంటే కోస్తా రీజియన్‌లో కూడా కాంగ్రెస్‌దే ఆధిపత్యం.

ఈ రీజియన్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు లభిస్తాయి. బీజేపీ-10, జేడీఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంటాయి. బెంగళూరు పరిధిలోనూ కాంగ్రెస్‌దే హవా. ఇక్కడ కాంగ్రెస్-17, బీజేపీ-10 స్థానాలను దక్కించుకుంటాయి. హైదరాబాద్-కర్ణాటక అంటే కల్యాణ కర్ణాటక రీజియన్ పరిధిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు 32, బీజేపీ-7, జేడీఎస్-3 స్థానాలను సాధిస్తాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+