ప్రజ్వల్ రేవణ్ణ దెబ్బకు ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోయిన మాజీ సీఎం, తలనొప్పి తట్టుకోలేక ?

హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయిలో కూడా ప్రజ్వల్‌ కేసు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. గురువారం అర్థరాత్రి సిట్ అధికారులు బెంగళూరు కెంపేగౌడ అంతర్జతీయ విమానాశ్రయంలో ప్రజ్వల రేవణ్ణను అరెస్టు చేశారు. ప్రజ్వల్ కర్ణాటక రాష్ట్రానికి రావడంతో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బెంగళూరు నుంచి మాయం కావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సొంత చిన్నాన, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆయన కుటుంబంతో సహా ఓ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకోవడానికి బెంగళూరు నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసు కారణంగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి తన కుటుంబంతో కలిసి రిసార్ట్‌కు వెళ్లిపోవడంతో జేడీఎస్ వర్గాలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నాయి.

Karnataka former CM HD Kumaraswamy left for the resort along with his family members

ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి బెంగళూరు రాకతో రాజకీయ విమర్శలు, ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు మాజీ సీఎం కుమారస్వామి ఆయన కుటుంబంతో కలిసి రిసార్టు వెళ్లినట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో పాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి అనితా కుమారస్వామి, కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామి, కోడలు రేవతి, మనవడు అవ్యన్ దేవ్ కలిసి రిసార్టుకు వెళలిపోయారని తెలిసింది.

ఏప్రిల్ 26వ తేదీన హాసన్‌లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ కావడంతో అవి వైరల్ అయ్యాయి. అప్పుడు విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే తాను బెంగళూరు వచ్చి సిట్ విచారణకు హాజరు అవుతానని ప్రజ్వల్ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ గురువారం అర్థరాత్రి బెంగళూరుకు రావడంతో సిట్ అధికారులు అతడిని ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేశారు.

Karnataka former CM HD Kumaraswamy left for the resort along with his family members

దాదాపు నెల రోజులు గడుస్తున్నా ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు కొలిక్కి రాకపోవడంతో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుటుంబాన్ని ఇబ్బందులోకి తోసినట్లు అయ్యింది. కర్ణాటక రాష్ట్రంలోనే ప్రముఖంగా ఉన్న పెద్దింటి గౌడ కుటుంబాన్ని ఆయన మనమడు ప్రజ్వల్ రేవణ్ణ ఇరుకున పెట్టేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ జైలుజీవితం ముగించుకుని బయటకు వచ్చి ఇప్పుడు టెంపుల్ రన్ మొదలుపెట్టారు.

బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ మంత్రి రేవణ్ణ భార్య భవానీ కూడా బయట ఎక్కడా కనిపించలేదు. ప్రజ్వల్ సోదరుడు సూరజ్ మాత్రమే ఇంటిలో ఉన్నాడని అంటున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసుతో తీవ్ర ఇబ్బందికి గురైన మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిని ఈ కేసు వ్యవహారం గురించి మరెక్కడా మాట్లాడకూడదని అనుకుని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రిసార్టుకు వెళ్లిపోయారని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+