ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్, అర్దరాత్రి సింగపూర్ వెళ్లిపోయిన దళపతి, ఏం జరిగింది ?
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి కన్ను మే 13వ తేదీ మీదపడింది. మే 13వ తేదీన ఎవరి జాతకాలు ఏమిటి ? అనే విషయంలో 100 శాతం క్లారిటీ వచ్చేస్తుంది, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో అదే రోజు అర్దరాత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి సింగపూర్ వెళ్లిపోయారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా జేడీఎస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, ఆ పార్టీని వివిద ప్రాంతాల్లో విస్తరించడానికి మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి అనేక ప్రయత్నాలు చేశారు. పంచరత్న యాత్ర పేరుతో హెచ్ డీ. కుమారస్వామి కర్ణాటకలోని అనేక జిల్లాల్లో పర్యటించి జేడీఎస్ పార్టీని ఆధరించండి అంటూ ప్రజలకు మనవి చేశారు.

సుమారు ఆరు నెలల నుంచి విశ్రాంతి లేకుండా మాజీ సీఎం హెచ్.డీ. కుమాస్వామి ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా గడిపారు. కొన్ని రోజుల క్రితం జ్వరంతో బాదపడిన మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన తరువాత కుమారస్వామి మళ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు.
బుధవారం కూడా మీజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించారు. అయితే బుధవారం సాయంత్రం, రాత్రి విడుదలైన ఎగ్జీట్ పోల్స్ ఫలితాలపై మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కొంచెం అసహనానికి గురైనారని జేడీఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.
బుధవారం అర్దరాత్రి దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమనాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు) చేరుకున్న మాజీ సీఎం హెచ్ డీ, కుమారస్వామి సింగపూర్ వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఇంతకాలం బిజీగా గడిపిన మాజీ సీఎం కుమారస్వామి విశ్రాంతి కోసం సింగపూర్ వెళ్లారని జేడీఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
మే 13వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. శనివారం మద్యాహ్నం మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ నుంచి బయలుదేరి బెంగళూరు చేరుకుంటారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ తో డీలా పడిన మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకంటే జేడీఎస్ కు తక్కువ సీట్లు వస్తాయని 2023 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడంతో జేడీఎస్ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications