బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్ముంటే రివర్స్ ఆపరేషన్ చెయ్యండి: మాజీ సీఎం సవాల్, బెంగళూరుకు అమెరికా ఎంత దూరం ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ కు శ్రీకారం చుడితే తాము రివర్స్ ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ ( కేపీసీసీ) అధ్యక్షుడు దినేషన్ గుండూరావ్ హెచ్చరించారు. కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ చేసిన వ్యాఖ్యలకు దమ్ముంటే కాంగ్రెస్ రివర్స్ ఆపరేషన్ కు సిద్దం కావాలని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప సవాల్ విసిరారు. బెంగళూరుకు అమెరికా ఎంతో దూరంలో లేదని యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు.

మాజీ సీఎం సవాల్

మాజీ సీఎం సవాల్

బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని నివాసంలో మంగళవారం బీఎస్. యడ్యూరప్ప మీడియాతో మట్లాడారు. మేము ఆపరేషన్ కమలకు సిద్దం అయ్యామని ఎక్కడా ఎప్పుడూ చెప్పలుదని మాజీ సీఎం బీఎస్, యడ్యూరప్ప అన్నారు. గత మూడు నెలల నుంచి కాంగ్రెస్ నాయకులు మేము ఆపరేషన్ కమలకు శ్రీకారం చుడుతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఎస్. యడ్యూరప్ప మండిపడ్డారు.

 నిందలు వేస్తున్న కాంగ్రెస్ !

నిందలు వేస్తున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతిని మూసి పెట్టడానికి బీజేపీ మీద నిందలు వేస్తున్నారని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రివర్స్ ఆపరేషన్ చేస్తే చెయ్యనివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆ పార్టీలోకి వెళ్లడానికి సిద్దంగా లేరని మాజీ సీఎం యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు.

బెంగళూరుకు అమెరికా ఎంతో దూరంలో లేదు !

బెంగళూరుకు అమెరికా ఎంతో దూరంలో లేదు !

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అమెరికా నుంచి ఫోన్ లో మాట్లాడుతూ తాను నిత్యం ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నానని అంటున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప చెప్పారు. బెంగళూరుకు అమెరికా ఎమైనా దూరంలో ఉందా ? ఆయన బెంగళూరుకు రానివ్వండి అని యడ్యూరప్ప అన్నారు. బెంగళూరుకు అమెరికా ఎంతో దూరంలో లేదని, సీఎం కుమారస్వామి వెంటనే బెంగళూరుకు వచ్చి మాట్లాడాలని మాజీ సీఎం యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు.

అసెంబ్లీ సమావేశం

అసెంబ్లీ సమావేశం

కర్ణాటక ప్రభుత్వం వెంటనే శాసన సభ సమావేశాలు నిర్వహించాలని యడ్యూరప్ప డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాల్లో తాము సంకీర్ణ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని, సమయం చూసి ముందడుగు వేస్తామని బీఎస్. యడ్యూరప్ప చెప్పారు.

బీజేపీ లీడర్స్ నిర్ణయం

బీజేపీ లీడర్స్ నిర్ణయం

ప్రస్తుత రాజకీయ పరిణాలమాలు దృష్టిలో పెట్టుకుని శాసన సభ సమావేశాలు నిర్వహించాలని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు. శాసన సభ సమావేశాలు నిర్వహిస్తే సభలో ఎలాంటి విషయాలపై చర్చించాలో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామని మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప అన్నారు.

బ్లాక్ మెయిల్ రాజకీయాలు

బ్లాక్ మెయిల్ రాజకీయాలు

బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నదని, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ఆరోపిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను భయపెడుతున్నారని, మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, అయితే ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని, అవసరం అయితే తాము రివర్స్ ఆపరేషన్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ బీజేపీ నాయకులను హెచ్చరించా

English summary
BJPf Karnataka state president BS Yeddyurappa challenged Congress to do 'reverse operation' if they can.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X