స్కాం కేసు: మాజీ మంత్రి నాయుడికి బిగ్ రిలీఫ్
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్య నాయుడి మీద నమోదు అయిన కేఐఏడీబీ భూ కుంబకోణం కేసు రద్దు చేస్తూ గురువారం కర్ణాటక హై కోర్టు తీర్పు చెప్పింది. కట్టాతో పాటు బెంగళూరులోని యలహంక, దాసరహళ్ళి ఎంఎల్ఏలు ఎస్.ఆర్. విశ్వనాథ్, ఎస్. మునిరాజు మీద నమోదు అయిన కేసులను గురువారం కర్ణాటక హై కోర్టు ఏకసభ్య బెంచ్ రద్దు చేసింది.
ముగ్గురు సీనియర్ బీజేపీ నాయకుల మీద భూ కుంబకోణాల కేసులు రద్దు కావడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. 2011 డిసెంబర్ లో కేఐఏడీబీ భూ కుంబకోణం కేసులు నమోదు కావడంతో కట్టా సుబ్రమణ్య నాయుడు తన మంత్రి పదవి (బీజేపీ)కి రాజీనామా చేశారు.

కట్టా సుబ్రమణ్య నాయుడు, ఆయన కుమారుడు కట్టా జగదీష్, ఇటాస్కా కంపెనీ ఎండీ శ్రీనివాస్ జైలుకు వెళ్లారు. తరువాత వీరికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. బీజేపీ శాసన సభ్యులు విశ్వనాథ్, మునిరాజు మీద భూములు కబ్జా చేశారని కేసులు నమోదు అయ్యాయి.
వీరు కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం వీరి మీద నమోదు అయిన కేసులను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అధికారులు పై కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉందని న్యాయనిపుణలు అంటున్నారు.












Click it and Unblock the Notifications