మోడీ ఈవెంట్ కు విద్యార్ధుల తరలింపు-కర్నాటక సర్కార్ వివాదాస్పద ఆదేశాలు..!

ఇవాళ వివేకానందుడి జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే నేషనల్ యూత్ ఫెస్టివల్ కర్నాటకలో వివాదాస్పదంగా మారింది. ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రతీ కాలేజ్ నుంచి విద్యార్ధుల్ని పంపాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు కారణం.

బెంగళూరులోని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ పాల్గొనే నేషనల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి కాలేజీకి 100 మంది చొప్పున ప్రతీ కాలేజ్ నంచి విద్యార్ధుల్ని పంపాలని కర్నాటక ప్రీ యూనివర్శిటీ డిపార్ట్ మెంట్ సర్కులర్ జారీ చేసింది. ఇందులో ఎట్టి పరిస్ధితుల్లోనూ విఫలం కావొద్దని ఇందులో కోరింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో వివాదం రేపుతోంది. ప్రీ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఉద్దేశించి పంపిన ఈ సర్కులర్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

karnataka government faces flak over sending 100 students from college to pm modi event

అయితే ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో అధికారులు కూడా దీనిపై ఆచితూచి స్పందిస్తున్నారు. విద్యార్ధుల్ని ప్రధాని మోడీ సభకు తప్పకుండా తరలించాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు మాత్రమే పాల్గొనాలని కోరినట్లు వారు చెబుతున్నారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో ఆ సర్కులర్ ను సైతం వెనక్కి తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారులు పంపిన సర్కులర్ ను ప్రిన్సిపాల్స్ అపార్ధం చేసుకున్నారని, అందుకే దాన్ని వెనక్కి తీసుకుంటున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+