కర్నాటక స్కూళ్లలో రాజ్యాంగ పీఠిక పఠనం తప్పనిసరి- కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం..

దేశంలో సనాతన ధర్మం, హిందూత్వ అంశాలపై కేంద్రం దూకుడుగా ముందుకెళ్తున్న తరుణంలో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిస్కూళ్లలో రాజ్యాంగ పఠనం తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని స్కూళ్లలోనూ రోజూ రాజ్యాంగ పీఠికను విద్యార్ధులు తప్పనిసరిగా పఠించేలా చూడాలని అధికారుల్ని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా కర్నాటక విధాన సభ బయట రాజ్యాంగ పీఠిక పఠించే కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో రాజ్యాంగ పీఠిక పఠనాన్ని రోజూ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అన్ని విద్యాసంస్ధలకు సర్కులర్ జారీ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మహదేవప్ప మాట్లాడుతూ భావి భారత పౌరులు రాజ్యాంగం చెప్పిన ప్రకారం తమ ప్రాథమిక విధులు, బాధ్యతలు తెలుసుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.

karnataka government made reading preamble a must in state schools

బీఆర్ అంబేద్కర్ నుంచి రాజ్యాంగం మనకు బహుమతిగా లభించిందని, సమానత్వం, పారదర్శకలను ఇది బోధిస్తుందని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. కాబట్టి విద్యాసంస్ధల్లో రాజ్యాంగ పీఠిక పఠనాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో విద్యార్ధులు తమ బాధ్యతలను తెలుసుకుని మెలిగే అవకాశం ఉందని పేర్కొంది. కర్నాటక విద్యాసంస్ధల్లో రాజ్యాంగ పీఠిక పఠనం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దీని ప్రకారం విద్యాసంస్ధల్లో ఉదయం ప్రార్ధనల సందర్భంగా విద్యార్ధులతో పీఠిక చదివించి, రాజ్యాంగాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించాలని సూచించినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్రభుత్వం తాజా ఆదేశాలతో అన్ని విద్యాసంస్ధల్లో నేటి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+