ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు విఫలం- రేపటి నుంచే ఉద్యోగుల నిరవధిక సమ్మె..!!
ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ ను మోగించారు. మార్చి 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.
బెంగళూరు: ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మార్చి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు.. ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- ఇప్పటికే కర్ణాటకలో వివిధ దశల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఉద్యోగుల సమ్మె సైరన్..
ఈ పరిస్థితుల మధ్య- కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ ను మోగించారు. నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీనికి ముహూర్తం కూడా పెట్టేశారు. బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు వెల్లడించారు. ఈ లోగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు. ఏడో పే కమిషన్ ను అమలు చేసి తీరాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో
అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో అధికార భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తక్షణ నివారణ చర్యలకు దిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమ్మెను విరమింపజేసే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మకు అప్పగించింది. వారి డిమాండ్లను నెరవేర్చడానికి అవసరమైన నివేదికను అందజేయాలని ఆదేశించింది.

చర్చలు విఫలం..
ఈ నేపథ్యంలో వందిత శర్మ రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఇవ్వాళ సాయంత్రం వరకూ చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల నాయకుడు సీఎస్ షడక్షరి ఇందులో పాల్గొన్నారు. ఏడో పే కమిషన్ అమలు, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరణ సహా.. ఇతర ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఆర్థిక పరమైన అంశాలు కావడం వల్ల తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని వందిత శర్మ అన్నారు.

ఎస్మా ప్రయోగించినా..
చర్చలు ముగిసిన అనంతరం సీఎస్ షడక్షరి విలేకరులతో మాట్లాడారు. ఎస్మా ప్రయోగిస్తామంటూ ప్రభుత్వం చెబుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తామని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తోన్నారని, ఎస్మా ప్రయోగిస్తామంటూ చెబుతున్నారని అన్నారు. తాము దేనికీ భయపడేది లేదని, సమ్మె చేస్తామని షడక్షరి తేల్చి చెప్పారు.

40 సంస్థలు మద్దతు.
తమ ఉద్యోగుల పోరాటానికి 40 సంస్థలు మద్దతు తెలిపాయని షడక్షరీ వెల్లడించారు. బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని, విద్య, వైద్యం, రెవెన్యూ సహా అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు తమకు అండగా ఉండబోతోన్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు.

లిఖితపూరకంగా..
సమ్మెను విరమింపజేయడానికి ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు నోటిమాటగా హామీలు ఇస్తోన్నారని, వాటిని తాము ఏ మాత్రం విశ్వసించట్లేదని షడక్షరి చెప్పారు. లిఖితపూరకంగా, అధికారిక ఉత్తర్వులను జారీ చేస్తే తప్ప సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారాయన. సమ్మెను విరమింపజేయడానికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తమతో మాట్లాడలేదని అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications