ఇక్కడ అల్లు అర్జున్‌కు రిమాండ్- అక్కడ సూపర్ స్టార్‌కు బెయిల్..!!

Challenging Star Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు ఊరట లభించింది. రేణుక స్వామి హత్యకేసులో అరెస్టయిన ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే కర్ణాటక హైకోర్ట్ ఆయనకు ఈ బెయిల్‌ను ఇచ్చింది.

అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది. ప్రస్తుతం దర్శన్ తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు. బళ్లారి సెంట్రల్ జైలులో అనారోగ్యానికి గురైన నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.

Karnataka High Court grants regular bail to Actor Darshan and Pavitra Gowda

తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ విశ్వజిత్ షెట్టి సారథ్యంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. దర్శన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీవీ నగేష్ వాదించారు. వాదోపవాదాలను ఆలకించిన తరువాత తీర్పును డిసెంబర్ 9వ తేదీన రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా దాన్ని వెల్లడించారు.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై ఈ ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు.

దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్‌‌ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు కూడా ఇందులో ఉన్నాయి. బెంగళూరులోని 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ దీనిపై విచారణ చేపట్టింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్యకేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.

అలాగే- 50 మందికి పైగా పోలీసులు, ఎనిమిది మంది డాక్టర్లు, 97 మంది ఇతర సాక్షుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెక్షన్ 164 సీఆర్పీసీ కింద 27 మంది తమ వాంగ్మూలాలను కోర్టు ముందు నమోదు చేసుకున్నట్లు వివరించారు.

రేణుక స్వామి హత్యకు కుట్ర పన్నడం, దాన్ని అమలు పరచడం, కిడ్నాప్, చిత్రహింసలు పెట్టడం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తామే హత్య చేసినట్లుగా నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రరేపించడం, దీని ద్వారా కేసు దర్యాప్తు, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్‌ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడ పాత్ర ఉందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+