బెంగళూరులో ప్రధాని మోదీ రోడ్ షోకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, 34 మెయిన్ రోడ్లు బ్లాక్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించడానికి అనుమతి ఇవ్వకూడాదని కర్ణాటకలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆదివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారని, అందువల ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురౌతాయని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ విజయ్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ విచారణ చేసింది. ఆదివారం బెంగళూరులో నీట్ పరీక్షలు జరుగుతున్నందు వలన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడాదని పిటిషనర్ హైకోర్టుకు మనవి చేశారు.

modi

ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని ప్రాంతాల్లోనే రోడ్ షో నిర్వహిస్తున్నారని, ఆ ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులులేవని బీజేపీ తరపున న్యాయవాది వాదించారు. రోడ్ షోలు పండుగ తరహాలో నిర్వహిస్తున్నారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11. 30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించడానికి కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మోదీ రోడ్ షో, శనివారం బెంగళూరులో 34 మెయిన్ రోడ్డు బంద్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో 36 కిలోమీటర్ల పొడవునా రోడ్ షో నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులకు ఓట్లు వెయ్యాలని మనవి చెయ్యనున్నారు. ప్రధాని రోడ్ షో సందర్బంగా శనివారం బెంగళూరులోని 34 రహదాలలో సంచారం నిషేధం అని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.

modi

మోదీ రోడ్ షో నిర్వహించే ఏరియాలు ఇవే. బెంగళూరులోని రమణ మహర్షి రోడ్డు, మైఖ్రీ సర్కిల్, ఆర్ బీఐ లేఔట్, జేపీ నగర్, రోస్ గార్డెన్, శిర్సీ సర్కిల్, జేజే నగర్, బిన్నిమిల్ రోడ్డు, షాలిని గ్రౌండ్స్, సౌత్ ఎండ్ సర్కిల్, అర్ముగం సర్కిల్, బుల్ టెంపుల్ మెయిన్ రోడ్డు, రామక్రిష్ణ ఆశ్రమం రోడ్డు, ఉమా టాకీస్, టీఆర్ మిల్, చామరాజపేట్ మెయిన్ రోడ్డు, బాళేకాయ్ మండి రోడ్డు, కేపీ అగ్రహార, మాగడి రోడ్డు మెయిన్ రోడ్డు, చోళరపాళ్య.

అలాగే ఎంసీ సర్కిల్, వెస్ట్ కార్డ్ సర్కిల్, ఎంసీ లేఔట్, నాగరబావి మెయిన్ రోడ్డు, బీజీ ఎస్ గ్రౌండ్స్, హవనూరు సర్కిల్, బసవేశ్వర నగర్ 8వ మెయిన్, బసవేశ్వర నగర్ 15వ మెయిన్, శంకరమఠ, మోదీ ఆసుపత్రి రోడ్డు, మల్లేశ్వరం సర్కిల్, సంపిగే రోడ్డు, స్యాంకీ రోడ్ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రహదారుల్లో వాహన సంచారాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారులు నిషేదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+