హైకోర్టులో మంత్రికి ఎదురుదెబ్బ, అక్రమాస్తుల కేసులో సార్ కు షాక్, ఏసీబీ, ఈడీ ఎంట్రీతో చుక్కలు !

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక గృహ నిర్మాణ, మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కు కొత్త చిక్కు ఎదురైంది. అవినీతి నిరోధక చట్టం కింద మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పై అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేశారు.

కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జమీర్ అహ్మద్ ఖాన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జమీర్ అహ్మద్ ఖాన్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ ఇదే అంశంపై సుప్రీం కోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉందని, తీర్పు వెలువడే వరకు తీర్పుపై ఆదేశాలు తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన ధర్మాసనం తీర్పుపై 30 రోజుల పాటు స్టే విధించింది.

Karnataka High Court hits back at Karnataka Minister Jameer Ahmed Khan in illegal assets case

అలాగే పిటిషనర్ వాదనలన్నింటినీ కర్ణాటక హై కోర్టు తిరస్కరించింది. పిటిషనర్ జమీర్ అహ్మద్ ఖాన్ కు చెందిన కార్యాలయాలు, నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. కేసు విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ దశలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. జమీర్ అక్రమాస్తులు సంపాధించారని, నేరానికి పాల్పడ్డారని అధికారులు అంటున్నారని కోర్టు ఉత్తర్వుల్లో వివరించింది. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అక్రమ ఆస్తుల ఆరోపణకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణ జరపడం తప్పనిసరి అని అంటున్నారు.

అయితే ఈ కేసులో ఏసీబీ నేరుగా పిటిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పిటిషనర్ ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నివేదిక దాఖలు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇది చట్టవిరుద్ధమైన చర్య కాబట్టి ఈ కేసును రద్దు చేయాలని జమీర్ అహ్మద్ ఖాన్ న్యాయవాదులు కర్ణాటక హైకోర్టును కోరారు.

లోకాయుక్త తరఫు న్యాయవాది మాట్లాడుతూ అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందువల్ల పిటిషనర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధమైనదేనని ఏసీబీ పేర్కొంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై 2022 మే 5వ తేదీన బెంగళూరులోని చామరాజ్‌పేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది.

Karnataka High Court hits back at Karnataka Minister Jameer Ahmed Khan in illegal assets case

ఎమ్మెల్యేల ఆదాయానికి మించి రూ. 82 కోట్లకు పైగా ఆస్తులు సంపాధించారని ఏసీబీ సోదాల్లో వెలుగు చూసింది. గతేడాది ఏసీబీ ఏర్పాటును కర్ణాటక హైకోర్టు రద్దు చేయడంతో ఏసీబీ దాఖలు చేసిన కేసును లోకాయుక్తకు బదిలి కావడంతో అక్కడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని జమీర్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే, దరఖాస్తు పరిష్కారమయ్యే వరకు ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ ను మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. సుప్రీంకోర్టులో మంత్రి జమీర్ అహ్మద్ దాఖలు చేసిన అప్పీలు పెండింగ్‌లో ఉంది. ఎందుకంటే గతంలో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి జమీర్ అహమ్మద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+