Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదు- సీఎంకు హైకోర్టు నోటీసులు జారీ

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. శాసన సభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలైన నేపథ్యంలో- సిద్ధరామయ్యకు నోటీసులను జారీ చేసింది కర్ణాటక హైకోర్టు. ఈ పిటీషన్‌పై వివరణ ఇవ్వాలని సూచించింది.

ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో- మైసూరులోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య పోటీ చేసిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన వీ సోమణ్నపై ఘన విజయం సాధించారు. 46 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించారు.

siddaramiahakarnatakahighcourt

ఈ ఎన్నికల్లో సిద్ధరామయ్య అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇటీవలే కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. వరుణ నియోజకవర్గం పరిధిలో నివసించే కేఎం శంకర అనే ఓ ఓటర్.. ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని కర్ణాటక హైకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎస్ సునీల్ దత్ యాదవ్.. సారథ్యంలోని సింగిల్ జడ్జి బెంచ్- ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది.

తనను గెలిపిస్తే- ఉచితాలను ఇస్తానంటూ సిద్ధరామయ్య తన నియోజకవర్గం ఓటర్లను ప్రలోభపెట్టారనేది కేఎం శంకర వాదన. ఇలా ప్రలోభ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారని, ఇది ప్రజా ప్రాతినిథ్య చట్టానికి విరుద్ధమని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇలా మభ్యపెట్టడం అనేది- అవినీతికి, రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా భావించాల్సి వస్తోందని చెప్పారు.

ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అయిదు ఉచిత గ్యారంటీలు- గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, శక్తి, యువనిధి.. పథకాలు అవినీతికి మార్గాలు వేశాయంటూ పిటీషనర్ స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 123 (2)ను ఉల్లంఘించినట్టయిందని అన్నారు.

ఉచితాలను అమలు చేస్తామంటూ ప్రలోభ పెట్టడం.. ఓ ఓటర్ అభిప్రాయాన్ని ప్రభావితం చేసినట్టనని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏ పార్టీ అయినా.. ప్రజలకు మేలు చేయక తప్పదని, అలాంటప్పుడు ఆ మేలును ఉచితాలుగా ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం అసాధారణమని పిటీషనర్ శంకర చెప్పారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+