ప్రభుత్వం కంపిస్తుంది.. లీకైన ఆడియోలో బాంబు పేల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!
కర్ణాటకలో రాష్ట్ర రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీం కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పాలసీ అండ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్, అలాడ్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్‌కు సంబంధించి ఒక లీకైన ఆడియో క్లిప్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఆ ఆడియో క్లిప్‌లో రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ కింద ఇళ్ల కేటాయింపుల కోసం అధికారులు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివరాలు బయటపెడితే ప్రభుత్వం కంపిస్తుందని ఆయన హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యక్తిగత సహాయకుడు సర్ఫరాజ్ ఖాన్‌తో ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులపై ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇళ్ల కేటాయింపుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. లంచం ఇచ్చిన వారికే ఇళ్లను కేటాయిస్తున్నారని.. ప్రజాప్రతినిధులమైన తాము చేసిన సిఫార్సులను కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తీసుకుని లబ్ధిదారులుగా మారుస్తున్నారని.. ఇదేమైన వ్యాపారమా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులు డబ్బులు ఇచ్చి ఇళ్లను పొందారని.. తాను ఎమ్మెల్యేగా చేసిన సిఫార్సులను తృణప్రాయంగా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జరిగితే ప్రజా ప్రతినిధులకు గౌరవం మిగులుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలా జరిగితే నాకు ఏ గౌరవం ఉంటుంది?" అని పాటిల్ ఆ ఆడియో క్లిప్‌లో అడిగారు. దీనిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి వ్యక్తిగత సహాయకుడు సర్ఫరాజ్ ఖాన్ సమాధానమిస్తూ.. ఈ ఆరోపణలను ఖండించారు. ఎవరు లంచం తీసుకున్నారో చెబితే వారిపై చర్యలు తీసుకుంటామని.. వారిని జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యేకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో లబ్ధిదారుల జాబితాను బహిరంగపరిస్తే ప్రభుత్వం "కంపిస్తుందని" పాటిల్ హెచ్చరించారు.
నిర్దిష్ట నియోజకవర్గాల్లో ఆరోపణలు
పాటిల్ తన ఆలం నియోజకవర్గంలో 950 ఇళ్ల పంపిణీలో లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. వీటిలో మున్నాళిలో 200 ఇళ్లు, హిట్టాలా శిరూర్‌లో 100, దంగపుర్‌లో 200, కవలగా, మదియాల్‌లో ఒక్కొక్క నియోజకవర్గంలో 200 ఇళ్ల కేటాయింపుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఈ లీక్ అయిన ఆడియోతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్లో ఇళ్ల కేటాయింపులపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

రాజకీయ స్పందనలు
లీకైన క్లిప్‌పై స్పందిస్తూ సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ.. "బీఆర్ పాటిల్ చెప్పింది 100 శాతం నిజం. ఈ ప్రభుత్వంలో లంచాలు ఇవ్వకుండా ఏ పని జరగదు. వారి సొంత ఎమ్మెల్యేనే ఇది చెబుతున్నారు. ప్రభుత్వం దీన్ని అంగీకరించి తమ తప్పును సరిదిద్దుకోవాలి" అని అన్నారు. హుబ్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహేష్ తెంగిన్‌కాయ్ కూడా కాంగ్రెస్‌పై దాడి చేస్తూ, "ఒక సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా పని జరగాలంటే, ఇళ్ల కేటాయింపులకు కూడా డబ్బు అవసరమని ఆడియోలో స్వయంగా అంగీకరించారు. 100 శాతం అవినీతి ప్రభుత్వం ఉందంటే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. వారు ప్రజలను, ముఖ్యంగా మైనారిటీలను మోసం చేస్తున్నారు, అవినీతిలో మునిగి తేలుతూ వారిని వాడుకుంటున్నారు" అని అన్నారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యల నుంచి దూరం పాటించింది.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications