ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !
బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శాఖ అధికారిగా ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని వేరే శాఖకు బదిలి చేశారు. కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించకపోవడం వలనే ఆమెను బదిలి చేశారని తెలిసింది.
రోహిణి సింధూరి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి కేజీ. శాంతారామ్ ను నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఫిబ్రవరి నెలలో రోహిణి సింధూరి దాసరిని కట్టడ, భవన నిర్మాణ, కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలి చేశారు.

కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించలేదని, అందుకే ఆమెను మరో శాఖకు బదిలి చేశారని ఆరోపణలు ఉన్నాయి. కార్మిక శాఖలో అవినీతి జరగడానికి ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి అంగీకరించకపోవడం వలనే ఆమెను బదిలి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఐఏఎస్ అధికారి మౌనిష్ మోద్గిల్ ను బదిలి చేసిన 24 గంటలు పూర్తి కాకముందే మరో ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరిని బదిలి చెయ్యడం విశేషం. కర్ణాటకలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలకు తెర లేసింది. మొత్తం మీద సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి సింధూరిని బదిలి చెయ్యడంతో ఐఏఎస్ అధికారులు ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications