అంతా చూశారే కానీ: మహిళా లాయర్‌ను కాలుతో తన్నుతూ, కొడుతూ వ్యక్తి పైశాచికం(వీడియో)
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఓ న్యాయవాది విచక్షణారహితంగా దాడి చేశారు. అయినా ఎవరూ ఆమెకు సహాయం రాకపోవడం విచారకరం.
శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా వినాయక్ నగర్ సమీపంలో ఓ మహిళను పదే పదే చెప్పుతో కొట్టి, తన్నాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. లాయర్ సంగీతపై ఆమె పొరుగింటి మహంతేష్ దాడి చేశాడు. ఈ సంఘటనను వీడియోలో చిత్రీకరించారు అక్కడున్నారు.

మంతేష్ తీవ్ర ఆగ్రహంతో ఆ మహిళపై దారుణంగా దాడి చేసినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. చెంపపై కొడుతూ.. ఆ మహిళను వెనక్కి నెట్టివేశాడు. అంతేగాక, ఆమె కడుపులో పులమార్లు తన్నాడు. మహిళ తనను తాను రక్షించుకోవడానికి ప్లాస్టిక్ కుర్చీని తీసుకుంటుండగా, ఆ వ్యక్తి ఆమెను మళ్లీ తన్నాడు. మరిన్ని చెంపదెబ్బలు కొట్టాడు. ఈ దృశ్యమంతా అక్కడున్నవారు వీడియో తీశారు. కానీ, ఆమెను కాపాడేందుకు మాత్రం ఏ ఒక్కరూ ముందు రాకపోవడం శోచనీయం.
Trigger warning: A lawyer was brutally assaulted by a man named Mahantesh in Vinayak nagar, Bagalkot, Karnataka. pic.twitter.com/kZ3OpUeKbi
— Mohammed Zubair (@zoo_bear) May 14, 2022
చుట్టుపక్కల జనం ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా మహిళను కొడుతున్నా.. ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సివిల్ వివాదం కేసులో వ్యక్తిగత శత్రుత్వం కారణంగా మంతేష్ మహిళా న్యాయవాదిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యాయవాది తనను చిత్రహింసలకు గురిచేశారని, వేధించారని ఆరోపించాడు. వీరిద్దరు గతంలో పలుమార్లు గొడవ పడ్డారని తెలిసింది. కాగా, మహిళపై దాడిపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications