8 నిమిషాల్లో లేడీ ఆఫీసర్ హత్య, కారు డ్రైవర్ హంతకుడు, 600 పేజీల్లో ఏం ఉందంటే ?
కర్ణాటకను కుదిపేసిన ఆ రాష్ట్ర గనుల శాఖ అధికారిని హత్య కేసులో పోలీసులు విచారణ పూర్తి చేశారు. లేడీ ఆఫీసర్ హత్యకేసులో నిందితుడు కిరణ్‌ను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు కోర్టులో చార్జిషీట్‌కు సమర్పించారు. 2023 నవంబర్ 4వ తేదీన గతంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కిరణ్ అనే నిందితుడు గనుల శాఖ సీనియర్ అధికారిని ప్రతిమను అతి సమీపం నుంచి చేంపేశాడు.
బెంగళూరు నగరంలోని దొడ్డకల్లసంద్రలోని కువెంపు నగర్ నివాసంలో ప్రతిమా హత్యకు గురైయ్యింది. సుబ్రమణ్యపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ ఎన్. జగదీష్ ను విచారణ అధికారిగా నియమించారు. ప్రతిమా హత్య జరిగిన మరుసటి రోజే నిందితుడు కిరణ్‌ను అరెస్టు చేశారు. ప్రతిమాను తానే హత్య చేశానని కిరణ్ కూడా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసు అధికారులు 600 పేజీల చార్జిషీటు తయారు చేసి బెంగళూరు 2వ ఏసీఎంఎం కోర్టుకు సమర్పించారు.

మేడమ్ ను 8 నిమిషాల్లో చంపేశాడు:
600 పేజీల ఛార్జిషీటులో నిందితుడు కిరణ్ వాంగ్మూలం, 70 మంది సాక్షుల వాంగ్మూలం, సీసీటీవీ ఫుటేజీలు, సాక్ష్యాధారాలు, డిజిటల్ సాక్ష్యాలు చేర్చారు. గనుల శాఖలో నిందితుడు కిరణ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతిమా వద్ద కారు డ్రైవర్‌గా కొన్ని నెలల క్రితం వరకు పనిచేశాడు. నేర నేపథ్యం ఉండటంతో కిరణ్ ను ఉద్యోగం నుంచి తొలగించి మరో డ్రైవర్‌ను నియమించారు. అయితే కిరణ్ తనను పనిలోకి తీసుకోవాలని ప్రతిమాను పదే పదే వేధిస్తున్నాడు. అందుకు ప్రభుత్వ అధికారిని ప్రతిమా నిరాకరించడంతో ఆమె హత్యకు నిందితుడు కిరణ్ పథకం వేశాడని చార్జ్ షీట్ లో పోలీసులు వివరించారు.
ప్రతిమా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నదని నిందితుడు కిరణ్ కు ముందే తెలుసు అని పోలీసులు చెప్పారు. దీంతో ప్రతిమాను హత్య చేసేందుకు నవంబర్ 3వ తేదీన ఆమె ఇంటికి కిరణ్ వెళ్లాడు. కానీ ఆ రోజు ప్రతిమాను చిక్కకపోవడంతో కిరణ్ వెనుదిరిగి వెళ్లిపోయాడు. నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రతిమా ఇంటికి వెళ్లిన కిరణ్ ఆ ఇంటి టెర్రస్‌పై దాక్కొన్నాడు. అదే రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పని ముగించుకుని ప్రతిమా బెంగళూరులోని ఆమె ఇంటికి వెళ్లారు.
తరువాత ప్రతిమా ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్లిన సమయంలో టెర్రాస్ మీద దాక్కొన్న కిరణ్ ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ప్రతిమా నోరు మూసిపెట్టి తరువాత ఆమె పంజాబీ డ్రెస్ వేల్ తోనే ఆమె మెడ బిగించి చంపేశాడు. ప్రతిమా శరీరం మీద ఉన్న బంగారు నగలు, బీరువాలో ఉన్న బంగారు గొలుసు, నగలు ఇంట్లోని కబోడ్ లో ఉన్న రూ. 5 లక్షలు దోచుకున్నాడు. ఇంట్లో దొరికిన నగలు, నగదు లూటీ చేసిన నిందితుడు ఇంకా ఇంట్లో వెతికాడు. మొత్తం 8 నిమిషాల్లో నిందితుడు కిరణ్ గనుల శాఖ అధికారిని ప్రతిమాను హత్య చేసి డబ్బులు, నగలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ప్రతిమా ఇంటి నుంచి బయటకు వచ్చి కొద్ది దూరం వెళ్లిన తరువాత కిరణ్ అతని స్నేహితుడికి ఫోన్ చేశాడు. అనంతరం స్నేహితులతో కలిసి మలే మహదేశ్వర్ కొండకు వెళ్లారు. ప్రతిమ ఇంట్లో 5 లక్షలు దోచుకున్న డబ్బును కిరణ్ అతని స్నేహితుడు శివ అనే వ్యక్తికి ఇచ్చాడు. మహదేశ్వర కొండ నుంచి తాను తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో డబ్బులు ఉంచాలని చెప్పాడు. ఈ డబ్బు ఎక్కడిది అని అడగకుండానే శివ ఆ డబ్బు తీసుకుని ఇంట్లోనే ఉంచాడు.
నిందితుడు కిరణ్ మాలే మహదేశ్వర్ కొండకు వెళ్లి పూజలు చేశాడు. అప్పటికే పవిత్రా హత్య గురించి మీడియాలో వార్తలు రావడంతో కిరణ్ అతని స్నేహితుల వద్ద ఆశ్చర్యం వ్యక్తం చేసి ఏమీ తెలియని వాడిలా నటించాడు. అయితే అదే మలేమహదేశ్వర కొండ మీద కిరణ్ అతని మొబైల్ పోన్ స్విచ్ ఆన్ చెయ్యడంతో అతని మొబైల్ నెంబర్ ట్రేస్ చేసిన పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్టు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications