వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: పిల్లలతో కలిసి స్విమ్మింగ్, సోషల్ డిస్టన్స్ అని ట్వీట్, వైద్యారోగ్యశాఖ మంత్రి తీరిదీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. భారత్‌తో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్ మాత్రం.. జాలీగా ఉన్నారు. ఔను పిల్లలతో స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకడుగు ముందుకేసిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సదరు మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

స్విమ్మింగ్‌పూల్‌లో..

స్విమ్మింగ్‌పూల్‌లో..

డాక్టర్ సుధాకర్.. కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి. కరోనా మహమ్మరిని నివారించాల్సిన బాధ్యత ఇతనిపై ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 247కి చేరగా.. చనిపోయిన వారి సంఖ్య ఆరుకి చేరింది. కానీ సదరు మంత్రికి మాత్రం కరోనా వైరస్ చేస్తున్న ప్రళయం కనిపించలేదు. రాష్ట్రంలో రోగులు.. వారికి అందిస్తోన్న వైద్యం గురించి ఆరాతీయాలి. కానీ శనివారం మాత్రం తన పిల్లలతో జాలీగా గడిపారు. స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టారు. ఆ సమయంలో ఫోటోలు కూడా తీశాడు. అలా అని ఊరుకోలేదు ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. వైరస్ విజృంభిస్తోన్నందున.. పూల్‌లో కూడా సోషల్ డిస్టన్స్ పాటించామని అందులో రాసుకొచ్చారు. చాలారోజుల తర్వాత పిల్లలతో గడిపే అవకాశం వచ్చిందని వివరించారు.

రాజీనామా...

రాజీనామా...

సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేయడంతో తెగ వైరలైంది. నెటిజన్లు ఏకిపారేశారు. ఆపత్కాలంలో బాధ్యతారహిత్యంగా వ్యవహరించిన సుధాకర్ తన మంత్రి పదవీకి రాజీనామా చేయాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. యావత్ ప్రపంచం వైరస్ బారినపడి అల్లాడిపోతుంటే.. మంత్రికి మాత్రం అంతా తీరిక సమయం దొరికిందా అని ప్రశ్నించారు. తన నైతిక బాధ్యతను మంత్రి మరచిపోయారని డీకే శివకుమార్ మండిపడ్డారు. వెంటనే సుధాకర్ రాజీనామా చేయాలని.. లేదంటే సీఎం యడియూరప్ప రాజీనామా చేయాలని అడగాలని కోరాలని పేర్కొన్నారు. తన ఫోటోపై దుమారం చెలరేగడంతో.. తర్వాత ట్వీట్టర్ నుంచి సుధాకర్ ఫోటోను డిలేట్ చేశారు.

Recommended Video

కరోనా Car In Hyderabad Going Viral || కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా ?
కేంద్రం ప్రకటన తర్వాతే..

కేంద్రం ప్రకటన తర్వాతే..


కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాయి. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక.. వెంటనే రాష్ట్రంలో అమలు చేస్తామని కర్ణాటక సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.

`

English summary
Karnataka medical education minister Sudhakar K posted a photo taking a dip in the swimming pool on Twitter which has created outrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X