లంచం తీసుకుంటూ దొరికిపోయిన మంత్రి సతీమణి
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రి ఆంజనేయ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భార్య రూ.7లక్షలు లంచం తీసుకుంటూ మీడియాకు దొరికపోయారు. వివరాల్లోకి వెళితే.. రూ.7కోట్లు విలువచేసే ఒక టెండర్‌ని ప్రత్యేకించి ఒక జిల్లాకు వచ్చేలా చూడాలంటూ ఓ వ్యక్తి మంత్రి భార్యను సంప్రదించాడు.
మంత్రిగారి నివాసంలోనే ఆవిడను కలుసుకుని రూ.7లక్షలు లంచం ఇచ్చాడు. స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా నకిలీ నోట్లను ఇచ్చినట్లు సదరు వ్యక్తి తెలిపాడు. ఈ తతంగమంతా ఓ టీవీ ఛానెల్ గురువారం ప్రసారం చేసింది.

దీంతో మంత్రి ఆంజనేయను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మంత్రి ఆంజనేయ మాట్లాడుతూ.. తనకు లంచం తీసుకోవాల్సిన అవసరం లేదని, తన భార్యకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు.
ప్రజలకు సేవలు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, విపక్షలు మాత్రం ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టాయి.












Click it and Unblock the Notifications