Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లిలో ఎమ్మెల్యేపై హత్యాయత్నం, ఉప ఎన్నికల సమమంలో మైసూరులో కలకలం !

మైసూరు/బెంగళూరు: కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద పెళ్లిలో అందరూ చూస్తున్న సమయంలో హత్యాయత్నం జరగడంతో కలకలం రేపింది. మైసూరు నగరంలోని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ మీద హత్యాయత్నం జరగడంతో ఆయన అనుచరులు, పెళ్లికి హాజరైన జనం షాక్ కు గురైనారు.

మైసూరు నగరంలోని నరసింహ రాజ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్వీర్ సేఠ్ ఆదివారం రాత్రి బన్నిమంటపంలోని బాలభవన్ ఆవరణంలో జరిగిన వివాహా శుభకార్యక్రమానికి హాజరైనారు. పెళ్లిలో అంతా సందడి సందడిగా ఉంది.

Karnataka MLA Tanveer Sait was attacked by an youth in a marriage function in Mysuru

పెళ్లికి హాజరైన పెద్దలు, బంధువులు, స్నేహితులు అందరూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో పెళ్లికి హాజరైన వారితో ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ పిచ్చపాటిగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు కత్తి తీసుకుని ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ పీక, మెడ, శరీరం మీద ఇష్టం వచ్చినట్లు పొడిచాడు.

ఆ సమయంలో షాక్ కు గురైన ఎమ్మెల్యే అనుచరులు, పెళ్లికి హాజరైనవారు ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ ను మైసూరు నగరంలోని కోలంబియా ఏషియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఎమ్మెల్యే మీద హత్యాయత్నం చేసిన యువకుడు మైసూరు నగరంలోని గౌసియానగరలోని కేఆర్ పురం నివాసి ఫర్హాన్ పాషా (24) అని ఎన్ఆర్ పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్ మీద ఎందుకు హత్యాయత్నం జరిగింది ? అనే విషయం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+