బళ్లారి ఎంపీ శ్రీరాములు నోటికాడ కూడు లాగేశాడు, నా ప్రతాపం చూపిస్తా, శిష్యుడు చాలెంజ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్రదుర్గ/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీలో టిక్కెట్ల పంపిణి విషయంలో రోజురోజుకూ అసమ్మతి నాయకుల ఆందోళన ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు బళ్లారి ఎంపీ బి. శ్రీరాములుకు సొంత అనుచరుల నుంచి పోటీ ఎదురైయ్యింది. శ్రీరాములు నోటికాడ కూడు లాగేశాడని, ఆయన్ను కచ్చితంగా ఓడించి ఇంటికి పంపిస్తామని ఆయన సొంత మద్దతుదారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి సవాలు చేశారు.

  మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించిన జనం
  ఎమ్మెల్యే టిక్కెట్

  ఎమ్మెల్యే టిక్కెట్

  బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని బీజేపీ అధిష్టానం సూచించింది. అయితే బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి తరువాత బీజేపీలో చేరిన స్థానిక ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి అనుచరులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

  అనుచరుడే శత్రువు

  అనుచరుడే శత్రువు

  శ్రీరాములు ప్రారంభించిన బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన తిప్పేస్వామి ఇప్పుడు శ్రీరాములుకు ఎదురుతిరిగాడు. బీజేపీ నుంచి శ్రీరాములు పోటీ చేసినా తాను కచ్చితంగా మాళకాల్మూరు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానాని తిప్పేస్వామి అంటున్నారు.

  నోటికాడ కూడు లాగేశాడు

  నోటికాడ కూడు లాగేశాడు

  శ్రీరాములు ఓ అపద్దాల నాయకుడు, కంచెంలో పెట్టిన అన్నం తిందాం అనుకుంటున్న సమయంలో నోటికాడ లాగేశాడు, ఇలాంటి వాడికి తగిన బుద్ది చెప్పడానికి నియోజక వర్గం ప్రజలు సిద్దంగా ఉన్నారని, కచ్చితంగా శ్రీరాములును ఓడించి ఇంటికి పంపిస్తామని మాళకాల్మూరు ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి తేల్చి చెప్పారు.

  కాంగ్రెస్, జేడీఎస్

  కాంగ్రెస్, జేడీఎస్

  బళ్లారి ఎంపీ శ్రీరాములుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చి తనకు ద్రోహం చేసిందని తిప్పేస్వామి ఆరోపించారు. తాను కాంగ్రెస్, జేడీఎస్ నాయకులతో సంప్రదించలేదని, స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాదిస్తానని ఎమ్మెల్యే తిప్పేస్వామి అంటున్నారు.

  రాజీకి ప్రయత్నాలు

  రాజీకి ప్రయత్నాలు

  బళ్లారి ఎంపీ శ్రీరాములు తనతో ఆప్యాయంగా మాట్లాడలేదని, ఏదో దారినపోయే దానయ్యతో మాట్లాడినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆరోపించారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీరాములును కచ్చితంగా ఓడించి పంపిస్తానని ఎమ్మెల్యే తిప్పేస్వామి సవాలు చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Molakalmuru MLA S.Thippeswamy said that, he will announce his decision on contesting for Karnataka assembly elections 2018 on April 14.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి