Karnataka New Cabinet : కొత్త మంత్రుల శాఖలు ఇవే... ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారంటే...

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై 29 మంది కొత్త కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు.ఆర్థికం,బెంగళూరు డెవలప్‌మెంట్,కేబినెట్ అఫైర్స్‌తో పాటు పలు శాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారు. కొత్త కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళా నేత శశికళకు హజ్ అండ్ వక్ఫ్ శాఖను కేటాయించారు.గతంలో యడియూరప్ప కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న 23 మందితో పాటు కొత్తగా ఆరుగురికి తాజా కేబినెట్‌లో చోటు దక్కింది. కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండవచ్చుననే ప్రచారం జరిగినప్పటికీ... కొత్త సీఎం బసవరాజ్ బొమ్మ ఆ పదవుల జోలికి వెళ్లలేదు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేసిన రోజే 29 మంది కొత్త మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

కొత్త కేబినెట్ మంత్రులు-వారి శాఖలు.. :

బసవరాజ్ బొమ్మై-ఫైనాన్స్,కేబినెట్ అఫైర్స్,బెంగళూరు డెవలప్‌మెంట్,ఇతర కేటాయించని శాఖలు

కెఎస్ ఈశ్వరప్ప - రూరల్ డెవలప్‌మెంట్,పంచాయతీరాజ్ డెవలప్‌మెంట్ శాఖ

karnataka new cabinet with 29 ministers here is the list of their portfolios

ఆర్ అశోక - రెవెన్యూ శాఖ

బి శ్రీరాములు - ట్రాన్స్‌పోర్ట్,ఎస్టీ సంక్షేమ శాఖ

గోవింద కర్జోల్ - మేజర్,మీడియం ఇరిగేషన్

వి సోమన్న - హౌసింగ్,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్

ఉమేష్ కత్తి - ఫారెస్ట్,ఫుడ్,సివిల్ సప్లైస్,కన్య్యూమర్స్ అఫైర్స్

అంగారా ఎస్ - ఫిషరీస్,పోర్టులు,ఇన్‌లాండ్ ట్రాన్స్‌పోర్ట్

అరగ జ్ఞానేంద్ర - హోమ్ డిపార్ట్‌మెంట్(ఇంటలిజెన్స్ మినహాయించి)

డా.అశ్వథ్ నారాయణ్ - హయ్యర్ ఎడ్యుకేషన్,ఐటీ బీటీ సైన్స్ అండ్ టెక్నాలజీ,స్కిల్ డెవలప్‌మెంట్

సీసీ పాటిల్ - పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్

ఆనంద్ సింగ్ - పర్యావరణం,టూరిజం

కోట శ్రీనివాస్ పూజారి - సాంఘీక సంక్షేమం,బీసీ వెల్ఫేర్

ప్రభు చౌహాన్ - యానిమల్ హస్బెండరీ

మురుగేష్ - భారీ,మధ్య తరహా పరిశ్రమల శాఖ

శివరాం హెబ్బార్ - కోఆపరేషన్

బీసీ పాటిల్ - అగ్రికల్చర్

భైరతి బసవరాజ్ - అర్బన్ డెవలప్‌మెంట్

డా.కె సుధాకర్ - ఆరోగ్యం,కుటుంబ సంక్షేమం,మెడికల్ ఎడ్యుకేషన్

శశికళ జొల్లె - ముజరై,హజ్ అండ్ వక్ఫ్

ఎంటీబీ నాగరాజు - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,చిన్న తరహా పరిశ్రమలు,పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు

కేసీ నారాయణ గౌడ - యువత సాధికారత,స్పోర్ట్స్

బీసీ నగేశ్ - ప్రైమరీ,సెకండరీ ఎడ్యుకేషన్

వీ సునీల్ కుమార్ - ఎనర్జీ,కన్నడ కల్చర్

హలప్ప ఆచార్ - కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్-మైన్స్ అండ్ జియాలజీ,మహిళా శిశు సంక్షేమం,వికలాంగ,సీనియర్ల సిటిజెన్ల సాధికారత

శంకర్ పాటిల్ - చేనేత,టెక్స్‌టైల్,సుగర్ కేన్ డెవలప్‌మెంట్

Recommended Video

    Karnataka New CM Basavaraj Bommai Biography | Oneindia Telugu

    మునిరత్న - ఉద్యాన శాఖ,ప్రోగ్రామ్ మానిటరింగ్ అండ్ స్టాటిస్టిక్స్

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+