నరహంతకుడు, కోర్టు ఆవరణంలోనే కాల్పులు, రెండు రాష్ట్రల్లో అనేక హత్యలు, చివరికి ?

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రలో అనేక హత్యలు, లూటీలు చేశాడని కేసులు నమోదు అయిన వ్యక్తిని కోర్టు ఆవరణంలో హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలోని విజయపురలో జరిగింది. భీమాతీరంలో నరహంతకుడిగా పేరుపొందిన బాగప్ప హరిజన్ మృత్యువుతో పోరాడుతున్నాడు.

భీమాతీరం, కలబురగి, విజయపుర, మహారాష్ట్రలో అనేక హత్యలు చేశాడని బాగప్ప మీద ఇప్పటికే 10 కేసులు నమోదు అయ్యాయి. జైలు శిక్ష అనుభవించిన బాగప్ప జామీను మీద బయటకు వచ్చాడు. న్యాయస్థానంలో ఇతని మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి.

Karnataka notorious criminal Bagappa shot by an anonymous person

ఓ కేసు విచారణ కోసం మంగళవారం (ఆగస్టు 8వ తేదీ) బాగప్ప తన అనుచరులతో కలిసి విజయపుర కోర్టుకు వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియన వ్యక్తులు రివాల్వర్లతో బాగప్ప మీద కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు బాగప్ప వెన్నులో దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు.

కోర్టు ఆవరణంలో కాల్పులు జరగడంతో అక్కడ ఉన్న న్యాయవాదులు, కక్షిదారులు పరుగు తీశారు. తీవ్రగాయాలైన బాగప్పను ఆసుపత్రికి తరలించడంతో అతను మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు చెప్పారు. పాతకక్షల కారణంగా బాగప్ప మీద కాల్పులు జరిపిఉంటారని, విచారణ చేస్తున్నామని విజయపుర పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A notorious criminal Bagappa Harijan shot by an anonymous person in Vijayapura court premise on Augut 8th. Jalanagar police registerd complaint, Bagappa has admitted to hospital.
Please Wait while comments are loading...