ఆ మహిళలకు రోజు నిద్రలేస్తే అదే పనే, వాళ్లకు వేరే ద్యాస ఉండదు, సార్ అందర్ !
బెంగళూరు/రాయచూర్: కర్ణాటకలో మూడు వారాల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయి దర్జాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి 113 ఎమ్మెల్యే సీట్లు అవసరం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 ఎమ్మెల్యే సీట్లను గెలిపించుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
గతంలో బీజేపీ నాయకులు ఇతర మతాల మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వం మారినా బీజేపీ నాయకులు, ఆ పార్టీ అనుబందం సంస్థల తీరులో ఎలాంటి మార్పురాలేదని వెలుగు చూసింది. ఇప్పుడు ముస్లీం మహిళల మీద వివాదాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ఎస్ నాయకుడి మీద పోలీసులు పంజా విసిరారు.

ముస్లిం మహిళలు కేవలం పిల్లలను కనే యంత్రాలుగానే పనికి వస్తున్నారని ఆరోపణలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజు తబాకే అరెస్టు అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడు అని పోలీసులు అన్నారు. ముస్లిం మతం మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజును అరెస్టు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసుగూర్‌లో ఆర్ఎస్ఎస్ నాయకుడు రాజు నివాసం ఉంటున్నారు. లింగసూగూర్ పోలీసులు తంబకీ అనే ప్రాంతంలో రాజును అరెస్ట్ చేశారు. నిన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు రాజు ముస్లిం మతంలోని మహిళలను కించపరుస్తూ అతని వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ముస్లిం యువతుల హోదాను కించపరిచేలా రాజు ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ముస్లిం యువతులు, మహిళలు కేవలం పిల్లలను కనే యంత్రాలుగా పనికి వస్తున్నారని, వారికి వేరే ధ్యాసలేదని వారిని అవమానించేలా రాజు పోస్ట చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రాజు వాట్సాప్ స్టేటస్ లోని కామెంట్స్ వైరల్ కావడంతో వాటిని చూసిన ముస్లిం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ముస్లీం మత పెద్దలు డిమాండ్ చేశారు. లింగసుగూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట వందలాది మంది ముస్లిం ప్రజలు నిన్న అర్థరాత్రి బైఠాయించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజును అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.












Click it and Unblock the Notifications