రోజూ అక్కా అక్కా అని పిలిచాడు, మాస్టర్ ప్లాన్ తో లేడీ టీచర్ ను అనంతలోకాలకు పంపించాడు !
కర్ణాటకలోని మేలుకోటేలో ఉపాధ్యాయురాలు దీపికా హత్య కేసు దర్యాప్తులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మాణిక్యనహళ్లి గ్రామానికి చెందిన నితీష్ కుమార్ అలియాస్ నితీష్ ను (21) అరెస్టు చేశారు. మాణిక్యనహళ్లికి చెందిన దీపికాను అదే గ్రామానికి చెందిన నితీష్ కుమార్ హత్య చేసి ఉంటాడని దీపికా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
అనంతరం నిందితుడు నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీపికను హతమార్చేందుకు ముందుగా పథకం పన్నిన నితీష్ అందుకు ముందే హత్య చెయ్యడానికి సిద్ధమయ్యాడని పోలీసులు అంటున్నారు. అయితే ప్లాన్ కు ఒకరోజు ముందే దీపికాను అదే స్థలంలో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు నితీష్ లేడీ టీచర్ దీపికాను గొంతు నులిమి హత్య చేసి ఆమె వేల్ తోనే ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేశాడని పోలీసులు చెబుతున్నారు.

మాణిక్యనహళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమార్తె దీపికా అదే గ్రామానికి చెందిన లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీపికాకు ఒక బిడ్డ కూడా ఉంది. ఇకే మేలుకోటే ఎస్.ఇ.టీ స్కూల్‌లో టీచర్‌గా పని చేసేది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజలకు కూడా దీపికా సుపరిచితురాలు అయ్యింది. జనవరి 20వ తేదీ ఉదయం స్కూటర్‌పై పాఠశాలకు వెళ్లిన దీపికా తరువాత ఇంటికి తిరిగి రాలేదు. దీపికా కోసం వెతికిన కుటుంబసభ్యులు చివరికి మేలుకోటే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు.
మేలుకోటే యోగనరసింహస్వామి కొండ దిగువన ఓ మహిళపై ఓ యువకుడు దాడి చేస్తున్న దృశ్యాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించి దానికి పోలీసులకు అందించాడు. దీని ఆధారంగా పరిసర ప్రాంతాల్లో వెతకగా లేడీ టీచర్ దీపికా స్కూటర్ లభ్యమైంది. తదుపరి విచారణలో జనవరి 22వ తేదీన యోగ నరసింహస్వామి కొండ దిగువన దుర్వాసన వెదజల్లుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలం నుంచి మట్టిని తొలగించగా ఉపాధ్యాయురాలు దీపికా రావు అలియాస్ దీపికా మృతదేహం లభ్యమైంది. మేలుకోటే స్టేషన్ పోలీసులు దీపికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి మిస్సింగ్ ఫిర్యాదును హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసును ఛేదించేందుకు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యతీష్ ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.

హత్యకు గురైన దీపికా భర్త లోకేష్ అదే గ్రామానికి చెందిన ప్రముఖ నితీష్ కుమార్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. నా భార్య దీపికాకు ఎక్కువగా పరిచయం ఉన్న నితీష్ ఆమెను హత్య చేసి ఉంటాడని లోకేష్ పోలీసులకు చెప్పాడు. నితీష్ తన భార్య దీపికాను నిత్యం అక్క అని పిలిచేవాడని, అతనే హత్య చేసి ఉండొచ్చని పోలీసులకు చెప్పాడు. దీనికి తోడు నితీష్ కుమార్ హత్య జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోవడంతో అందరికి అనుమానం ఎక్కువ అయ్యింది.
అంతకు ముందు నా కోసం వెతకకండి, ఇది నా తప్పు అని నితీష్ అతని కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. టీచర్ దీపికాకు ఫోన్ చేసిన చివరి వ్యక్తి కూడ నితీష్ కావడంతో అతని కోసం పోలీసులు గాలించారు. చివరికి కర్ణాటక బార్డర్ లో నితీష్ పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసులు నిందితుడు నితీష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ముందుగా ప్లాన్ చేసుకున్న నితీష్ తరువాత దీపికాకు ఫోన్ చేసి ఆమెను రహస్య ప్రాంతానికి పిలిపించుకుని తరువాత ఆమెతో గొడవ పడి ఆమె గొంతును బిగించి హత్య చేసి ఆమె శవాన్ని గోనె సంచిలో వేసి గొయ్యిలో పాతిపెట్టి పరారైనాడని పోలీసులు తెలిపారు. అయితే అక్కా అక్కా అంటూ వెంట తిరిగే నితీష్ తరువాత దీపికాను ఎందుకు హత్య చేశాడు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications