gims: జిమ్స్ మాజీ డైరెక్టర్ భూసారెడ్డి మీద కేసు నమోదు చేసిన పోలీసులు, సార్ ఏం చేశారంటే ?
కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక సంజీవినిగా పేరొందిన గదగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) మాజీ డైరెక్టర్ పీఎస్ భూసారెడ్డిపై గదగ్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బెంగళూరు/గదగ్: కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక సంజీవినిగా పేరొందిన గదగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) మాజీ డైరెక్టర్ పీఎస్ భూసారెడ్డిపై గదగ్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కర్ణాటక
వైద్య విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు తాత్కాలిక డైరెక్టర్ బసవరాజ్ బొమ్మనహళ్లి భూసా రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
1వ తేదీ మే 2015 నుండి 10వ తేదీ ఆగస్టు 2020 వరకు జిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న పీఎస్ భూసారెడ్డి సైన్స్ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన పత్రాలను మార్చడం మరియు కాపీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ పత్రాలను దొంగిలించి, నకిలీ పత్రాలను సృష్టించి, ఒరిజినల్ డాక్యుమెంట్‌కు జోడించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని భూసారెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆయన మీద కేసు నమోదైంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీఎస్ భూసారెడ్డి నివాసంలో కూడా సోదాలు చేసినట్లు సమాచారం. పీఎస్ భూసారెడ్డి పదవీకాలం పూర్తి అయితన తరువాత గవర్నింగ్ కౌన్సిల్ బాడీ మీటింగ్ ప్రొసీడింగ్స్, ఫైనాన్స్ కమిటీ ప్రొసీడింగ్స్ సహా డబ్బు, నియామకానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేయలేదు.
గతేడాది బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బసవరాజ్ బొమ్మనహళ్లి తనకు సంబంధిత పత్రాలు అందించాలని భూసారెడ్డికి లేఖ పంపించినా స్పందింయలేని, చివరికి మెమో ఇచ్చినా ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో వైద్య విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు పెద్దగా సమాచారం బయటకు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే పలు ఫైల్స్ అదృశ్యం కావడానికి గల కారణాలేమిటో అని పోలీసులు, జిమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications