మీ వంశం ముఖ్యమా ?, పక్కింటోళ్ల వంశం ముఖ్యమా ?, మీరే డిసైడ్ చేసుకోండి, నటి మీద కేసు !

బెంగళూరు/హావేరి: మీ వంశం కాకుండా వేరే వంశం అభివృద్ది కావాలంటే ఈ పార్టీకి ఓటు వెయ్యండి, మీ వంశం వదిలేసి విదేశీ వంశం అభివృద్ది కావాలంటే ఈ పార్టీకి ఓటు వెయ్యండి, మీ వంశంతో పాటు మీరు, మీ దేశం అభివృద్ది కావాలంటే ఈ పార్టీకి ఓటు వెయ్యండి అంటూ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బహుబాష నటి, బీజేపీ నాయకురాలి మీద కేసు నమోదు అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మూడు ప్రధాన పార్టీలలోని కొందరు నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో కొందరు నాయులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల మీద, వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు దూషించుకోకూడదని, ఎన్నికల నియమాలు పాటించాలని ఎన్నికల కమీషన్ అధికారులు సూచించారు.

Karnataka: Police have registered a case against the actress who made controversial comments.

ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తున్న వారి మీద ఎన్నికల కమీషన్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు అవుతున్నారు కొంత మంది నాయకులు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. కర్ణాటకలోని హావేరి జిల్లాలోని హీరేకరూరులో బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బహుబాష నటి, అలనాటి హీరోయిన్, బీజేపీ నాయకురాలు శృతి ఈ కార్యక్రమానికి హాజరైనారు.

ఈ సందర్బంగా నటి శృతి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంటేనే ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారని నటి శృతి చెప్పారు. మన జీవితాలు బాగుండాలి, ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని అనుకుంటే కర్ణాటకలో మరోసారి బీజేపీని ఆధరించాలని నటి శృతి ఓటర్లకు మనవి చేశారు.

నువ్వు వస్తానంటే.... నేను వద్దంటానా ?, గాలి ఇంటికి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే !

https://telugu.oneindia.com/news/india/bjp-gave-hand-to-sitting-mla-former-minister-and-bjp-sitting-mla-who-ran-to-the-house-of-gali-341283.html

నేను ఒకే ఒక్కమాటలు చెప్పి నా ప్రసంగం పూర్తి చేస్తానని నటి శృతి అన్నారు. మీ వంశం కాకుండా వేరే వంశం అభివృద్ది కావాలంటే జేడీఎస్ పార్టీకి ఓటు వెయ్యండి, మీ వంశాన్ని గాలికి వదిలేసి విదేశీ వంశం అభివృద్ది కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యండి, మీ వంశంతో పాటు మీ దేశం అభివృద్ది కావాలంటే బీజేపీకి ఓటు వెయ్యండి అంటూ నటి శృతి బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బహిరంగంగా ఇతర పార్టీలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ప్రజల మధ్య, మూడు పార్టీల కార్యకర్తల మధ్య విధ్వేషాలు రెచ్చెగొట్టేలా వ్యాఖ్యలు చేశారని నటి శృతి మీద హీరోకరూరు నోడల్ అధికారి పంపావతి ఫిర్యాదు చెయ్యడంతో నటి మీద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక మంత్రి, స్థానిక బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి వెళ్లిన నటి శృతి మీద కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

కుటుంబ రాజకీయాలు చెయ్యాలంటే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే చెయ్యాలని, బీజేపీలో కుటుంబ రాజకీయాలకు చోటు లేదని, సామాన్య ప్రజల అభివృద్ది ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకుల లక్షం అని, అందుకే మనం బీజేపీకి ఓటు వెయ్యాలని నటి శృతి లెక్షర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని కేసు నమోదు కావడంతో చట్టపరంగా న్యాయపోరాటం చెయ్యడానికి నటి శృతి సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+