షాకింగ్ న్యూస్.. మంత్రులు, ఎమ్మెల్యేల హనీ ట్రాప్, అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ లు
ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని హనీ ట్రాప్ వ్యవహారం కుదిపేస్తోంది. కర్ణాటక రాజకీయ వర్గాలలో ఆందోళనకు కారణంగా మారింది. కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ వ్యవహారం పైన రేగిన దుమారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో టెన్షన్ కు కారణంగా మారింది. కర్ణాటక కు చెందిన 48 మంది ఎమ్మెల్యేలు ఈ వలపు వలకు చిక్కినట్టు అసెంబ్లీలో ఒక మంత్రి ప్రకటించడం ప్రస్తుతం కలకలం రేపింది.
కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేల హనీ ట్రాప్
ఇటీవల ఇద్దరు మంత్రుల పైన హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పిడబ్ల్యూడి మంత్రి సతీష్ జార్కిహోళీ ప్రకటించారు. అంతేకాదు ఈ హనీ ట్రాప్ కు సంబంధించి అభ్యంతరకరమైన వీడియోలు, సంభాషణలు, సిడిలు, పెన్ డ్రైవ్ లలో ఉన్నాయని చెప్పి ఆయన అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.

విచారణకు డిమాండ్
ఈ హనీ ట్రాప్ లో బాధితులలో అధికార పక్షం నేతలే కాదు విపక్ష సభ్యులు కూడా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగింది. దీనిపై విచారణ జరిపించాలని అధికార విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచాన్నే గజగజ వణికిస్తున్న హనీ ట్రాప్ కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో చర్చకు దారితీసింది.
దర్యాప్తు ప్రారంభిస్తాం
కర్ణాటక రాష్ట్రంలో ఈ తరహా హనీ ట్రాప్ వ్యవహారం కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది దీనిని వాడుతున్నారని మంత్రి సతీష్ జార్కిహోళీ పేర్కొన్నారు. ఇక ఈ తరహా చర్యలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయాలని సదరు మంత్రికి కూడా సూచించినట్టుగా ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంలో వెంటనే దర్యాప్తు మొదలుపెడతామని పేర్కొన్నారు.
హోం శాఖకు హనీ ట్రాప్ పై ఫిర్యాదు
ఇక ఈ హనీ ట్రాప్ వ్యవహారం పైన కర్ణాటక సహకార శాఖ మంత్రి కే ఎన్ రాజన్న కూడా మాట్లాడారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన వ్యవహారం కాదని అన్ని పార్టీల వాళ్ళు బాధితులుగా ఉన్నారని పేర్కొన్న ఆయన దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్నారు. హోం శాఖకు కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాలి
దీని వెనుక ఎవరున్నారు అనే విషయం బయటకు రావాలని, దీనిపైన ప్రజలకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది తెలియాలని మంత్రి రాజన్న పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారం పైన స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎవరినైనా అరెస్ట్ చేశారా లేదా అన్నది తనకు తెలియదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications