బళ్లారిలో బీటీపీఎస్ ను పరిశీలించిన మంత్రి, ఆ సమస్య ఉంది కాని, మా పని మేము !

బళ్లారి/ బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన ఎన్నికల హామీ పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. అయితే కుడి చేతితో ఉచిత విద్యుత్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడమ చేతితో విద్యుత్ చార్జీలు పెంచేసిందని కర్ణాటక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే గత నెల నుంచి విద్యుత్ చార్జీలు పెరిగిపోవడంతో ఎక్కువ శాతం మంది ప్రజలు మండిపడుతున్నారు. విద్యుత్ చార్జీలు పెంచింది మేము కాదని, గత బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, విద్యుత్ చార్జీలు పెంపుకు మాకు ఎలాంటి సంబంధంలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరణ ఇచ్చారు.

Karnataka Power Minister KJ George inspected BTPS in Bellary.

ఇలాంటి సమయంలో కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి కేజే, జార్జ్ బళ్లారి పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారి తాలూకాలోని కుడితిని సమీపంలోని బీటీపీఎస్‌ని కర్ణాటక విద్యుత్ శాఖా మంత్రి శాఖ మంత్రి కేజే, జార్జ్‌ సందర్శించారు. బీటీపీఎస్ ని సందర్శించి పరిశీలించిన అనంతరం మంత్రి జార్జ్ బళ్లారి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు విద్యుత్ శాఖా మంత్రి జార్జ్ కు అక్కడి పరిస్థితులు వివరించారు.

విద్యుత్ సరఫరా చేసే విషయంలో ఎలాంటి సమస్య లేదని అధికారులు మంత్రి జార్జ్ కు చెప్పారని తెలిసింది. రాష్ట్రంలో రుతుపవనాల జాప్యం కారణంగా విద్యుత్ ఉత్పత్తిలో సమస్యలు ఎదురౌతున్నాయని, రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని మంత్రి కేజే. జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏ విధంగానూ పెంచలేమని, సోలార్ విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేజే. జార్జ్ అన్నారు.

Karnataka Power Minister KJ George inspected BTPS in Bellary.

కర్ణాటకలో బొగ్గు కొరత ఉందని మంత్రి జార్జ్ అన్నారు. కానీ విద్యుత్ కొరత లేకుండా చూస్తామని మంత్రి జార్జ్ అన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ హామీ పథకం గురించి మంత్రి కేజే. జార్జ్ మాట్లాడుతూ తక్కువ విద్యుత్ ఉపయోగించే వారికి కూడా ఫ్లాట్ బిల్లు ఇస్తామని, విద్యుత్ తక్కువ ఉపయోగించే వాళ్లు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి జార్జ్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+