ADGP: ఎస్ఐ స్కామ్ కేసు, ఏడీజీపీ అరెస్టు, చరిత్రలో మొదటిసారి, ఐపీఎస్ అధికారి, గోవిందా గోవింద !

బెంగళూరు: కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వాన్ని కుదిపేసిన సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాల స్కామ్ లో ఎవ్వరూ ఊహించిన విదంగా పోలీసులు అధికారులు ఏడీజీపీని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే ఇంత వరకు ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చెయ్యడం ఇదే తొలిసారికావడంతో పోలీసు అధికారులు హడలిపోయారు.

కర్ణాటకలో ఇటీవల ఎస్ఐ ఉద్యోగాల్లో గోల్ మాల్ జరిగిన విషయం తెలిసిందే. ఎస్ఐ పరిక్షల ఉద్యోగాల రాతపరీక్షల సమయంలో ప్రశ్న పత్రాలు లీక్ చెయ్యడం, పరీక్షా కేంద్రాలు జవాబు పత్రాలు తారుమారు చేశారని, ఎస్ఐ ఉద్యోగాల పరీక్షల్లో పాస్ చేయిస్తామని రూ. కోట్లలో డబ్బలు వసూలు చేశారని ఆరోపలు వచ్చాయి.

 Karnataka PSI psi recruitment scam: ADGP Amrit Paul arrest. First time Higher level IPS office arrest in Karnataka.

ఎస్ఐ ఉద్యోగాల నియామకం స్కామ్ కేసులో ఇప్పటికే పోలీసు అధికారులు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ ఉద్యోగాల పరీక్షలు రాసిన అభ్యర్థులు, పరీక్షా కేంద్రాల్లో విధుల్లో ఉన్న అధికారులను అరెస్టు చేశారు. ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ లో కర్ణాటకకు చెందిన ఏడీజీపీ అమృత్ పాల్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

కర్ణాటకలో చరిత్రలో ఏడీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ కేసులో డీఎస్పీ శాంతకుమార్ అరెస్టు అయ్యారు. ఇప్పటి వరకు కేసు విచారణ చేసిన సీఐడీ అధికారులు ఏడీజీపీ అమృత్ పాల్ ఐపీఎస్ ను అరెస్టు చెయ్యడంతో కర్ణాటకలోని పోలీసు శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+