మాజీ ప్రధాని ఫ్యామిలీలో ?, టిక్కెట్ ఇవ్వకపోతే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, భార్య కోసం ?
బెంగళూరు/హాసన్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. పలు నియోజక వర్గాల్లో అనేక మంది నాయకులు ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని పార్టీల్లో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం అనేక మంది నాయకుల మధ్య పోటీ ఉంది. అయితే సొంత పార్టీలో అన్నదమ్ముల మధ్య ఓ నియోజక వర్గం టిక్కెట్ విషయంలో తేడాలు వచ్చాయి.
మాజీ ప్రధాని కుటుంబంలో ఒక్క నియోజకవర్గం ఎమ్మెల్యే టిక్కెట్ విషయంలో అన్నదమ్ముల మద్య విభేదాలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మాజీ ప్రధాని, దళపతి హెచ్.డీ. దేవేగౌడ సొంత పార్టీ జేడీఎస్. జేడీఎస్ పార్టీకి ఏ టూ జెడ్ అన్ని దేవేగౌడ ఫ్యామిలీనే. మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుమారుడు హెచ్.డీ. కుమారస్వామి కర్ణాటక మాజీ సీఎం అయిన వియం తెలిసిందే.

ఇక మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ మరో కుమారుడు హెచ్.డీ. రేవణ్ణ కర్ణాటకలో మంత్రిగా పని చేశారు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ పార్టీ ఎంపీ. మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. హెచ్.డీ. కుమారస్వామి కుమారుడు. సినిమా హీరో నిఖిల్ కుమారస్వామి గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి బహుబాష నటి సుమలత చేతిలో ఓడిపోయారు.
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుటుంబంలో దాదాపు అందరూ రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు మాజీ ప్రధాని దేవేగౌడ కోడలు, మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ సతీమణి భవాని రేవణ్ణ హాసన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే కుటంబ రాజకీయాల పార్టీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ లో ఇప్పుడు ఇదో పెద్ద రామాయణంగా మారిపోయింది.

భవాని రేవణ్ణకు హాసన్ టిక్కెట్ ఇవ్వడానికి మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి పెద్దగా ఆసక్తి చూపడం లేదని జేడీఎస్ పార్టీ నాయకులే కొందరు అంటున్నారు. చాలాకాలం నుంచి హాసన్ టిక్కెట్ విషయంలో మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారులు హెచ్.డీ. కుమారస్వామి, హెచ్.డీ. రేవణ్ణల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఇంత వరకు హాసన్ టిక్కెట్ భవాని రేవణ్ణకు ఇస్తామని కుమారస్వామి ఎక్కడా ప్రకటించలేదు.
తన భార్య భవానికి హాసన్ టిక్కెట్ ఇవ్వకపోతే ఆమెను అక్కడ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటానని హెచ్.డీ. రేవణ్ణ సొంత తమ్ముడు కుమారస్వామిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వెలుగు చూడటం జేడీఎస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. జాతీయ పార్టీలలో చాలా మంది రాజకీయ వారసత్వం తీసుకుంటూ వస్తున్నారని, వారిని విమర్శించకుండా మమ్మల్ని కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హెచ్.డీ. రేవణ్ణ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మీద మండిపడుతున్నారు.

ఇటీవల మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఎవ్వరి పేరు ఎత్తకుండానే తాను బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే వ్యక్తి కాదని, ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశానని చెప్పారు. మొత్తం మీద మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కుటుంబంలో హాసన్ అసెంబ్లీ నియోజక వర్గం టిక్కెట్ విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఇది ఎంత వరకు దారితీస్తుందో చెప్పలేమని జేడీఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications