Karnataka winners : కర్నాటక ఎన్నికల్లో విజేతలు వీరే..డీకే, సిద్ధూ, బొమ్మై, గాలి జనార్ధన్ గెలుపు

కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తుండగా.. బీజేపీ, జేడీఎస్ ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, అనంతరం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులోనూ ఆధిక్యాన్ని కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల్లోనూ సత్తా చాటుకుంటోంది. తుది ఫలితాలు వెలువడేందుకు సాయంత్రం కావొచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రకటించిన విజేతల వివరాలు ఓసారి చూద్దాం..

Karnataka Results 2023

కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర స్ధానం నుంచి విజయం సాధించారు.వరుణ సీటు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య గెలుపొందారు. హిరియూర్ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి సుధాకర్ గెలిచారు. కుడ్లిగిలోనూ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్ విజయం సాధించారు. మొలకల్మూరు స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి గోపాలకృష్ణ విజయం సాధించారు. హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్ధి స్వరూప్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎల్లాపూర్ స్ధానంలో బీజేపీ అభ్యర్ధి శివరామ్ గెలుపొందారు.

చల్లకెరెలో కాంగ్రెస్ అభ్యర్ధి రఘుమూర్తి విజయం సాధించారు. ధార్వాడ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి వినయ్ కులకర్ణి గెలిచారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి గంగావతి స్దానం నుంచి గెలుపొందారు. బళ్లారి రూరల్ (ఎస్టీ) స్ధానంలో బీజేపీ అభ్యర్ధి శ్రీరాములుపై కాంగ్రెస్ అభ్యర్ధి నాగేంద్ర గెలిచారు. చిత్తాపూర్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా గెలిచారు. గోకక్ స్ధానం నుంచి మంత్రి రమేష్ జార్కిహోళి విజయం సాధించారు. షిగ్గావ్ నుంచి సీఎం బసవరాజ్ బొమ్మై గెలిచారు. సొరబ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మధు బంగారప్ప విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+