కర్నాటకల ఎన్నికల్లో కాంగ్రెస్ ట్విస్ట్, బీజేపీలో టెన్షన్: రంగంలోకి అమిత్ షా
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. మొదట బీజేపీకు స్పష్టమైన మెజార్టీ వస్తుందనుకున్నప్పటికీ ఆ తర్వాత దాదాపు ఐదు నుంచి పది సీట్లు తగ్గి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన 112 సీట్లకు ఆరేడు సీట్ల దూరంలో ఉండనుంది.
Recommended Video

ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు బీజేపీ 82 స్థానాల్లో గెలుపొంది 25 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో గెలుపొంది 24 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 18 స్థానాల్లో గెలుపొంది 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఇద్దరు గెలుపొందారు.
ఓ వైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ అధినేత కుమారస్వామికి గాలం వేస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెబుతూ ఆయనతో చర్చలు జరుపుతోంది. మరోవైపు బీజేపీ ఇతరుల వైపు చూస్తోంది. అయితే ఇతరులు గెలుపొందింది ఇద్దరే. దీంతో బీజేపీకి చిక్కు వచ్చి పడింది.

కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఇస్తామని చెబితే ఆ పార్టీ తప్పుకుండా ఆ పార్టీ మద్దతు తీసుకొని జేడీఎస్ అధికార పీఠంలో కూర్చుంటోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ పావులు కదుపుతోంది. జేడీఎస్‌తో బీజేపీ కూడా చర్చలు జరుపుతోంది. మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పార్టీ సీనియర్ నేత మురళీధర రావుకు ఫోన్ చేశారు. స్వతంత్రులను, ఇతరులను ఆకర్షించే దిశగా ఆయనను పురమాయించారని తెలుస్తోంది.
కర్నాటక రాజకీయం నిమిష నిమిషానికి మారుతోంది. మొదట కాంగ్రెస్‌కు, ఆ తర్వాత బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతుండగా.. ఇప్పుడు హంగ్ దిశగా సాగుతోంది. మొదట సంతోషంగా కనిపించిన బీజేపీకి ఆ తర్వాత టెన్షన్ పట్టుకుంది. కనీసం ఒకటి రెండు సీట్లు తగ్గితే ఇండిపెండెట్లతో సర్దుకోవచ్చు. కానీ అంతకుమించి తగ్గితే కష్టమే. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ బయటి నుంచి మద్దతిస్తే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications