కర్నాటక ఎన్నికలు: శివమొగ్గలో బీజేపీ నేత ఈశ్వరప్ప వెనుకంజ

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేత ఈశ్వరప్ప ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షిమోగా నుంచి బరిలో నిలిచారు. కానీ ఆయన వెనుకబడ్డారు. సిద్ధరామయ్య చాముండేశ్వరిలో వెనుకంజలో, బాదామిలో ముందంజలో ఉన్నారు. శికరిపురలో యెడ్యూరప్ప ముందంజలో ఉన్నారు.

తొమ్మిది గంటల సమయానికి కాంగ్రెస్ 65, బీజేపీ 65, జేడీఎస్ 31 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇరు పార్టీలు పోటీపోటీగా ఉన్నాయి. వరుణలో సిద్ధరామయ్య కొడుకు యతీంధ్ర ఆధిక్యంలో ఉన్నారు.

Karnataka results: BJP leader Eshwarappa is trailing in Shivamogga

బెంగళూరు రీజియన్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మైసూరు డివిజన్‌లో జేడీఎస్ సత్తా చాటుకుంటోంది. గుల్బర్గాలోను బీజేపీ ముందంజలో ఉంది.

కాగా, సోమవారం ముగిసిన ఎన్నికల్లో 72.59 శాతం పోలింగ్‌ నమోదయింది. పలు కారణాలతో వాయిదా పడిన రెండు నియోజకవర్గాల్లోని మూడు పోలింగ్‌ బూత్‌ల్లోనూ సోమవారం పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్‌ పత్రాలకు బదులుగా ఈసారి అన్నిచోట్లా ఈవీఎంలతో పోలింగ్‌ను నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+