వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు కలిస్తే ఫలితం వేరేలా ఉండేది: కర్నాటక ఎన్నికలపై మమతా బెనర్జీ ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: కర్నాటక ఎన్నికల ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవని అబిప్రాయపడ్డారు.

లైవ్: కర్ణాటక ఫలితాలు: స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ, యడ్యూరప్ప విజయం, సిద్ధరామయ్య ఓటమి లైవ్: కర్ణాటక ఫలితాలు: స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ, యడ్యూరప్ప విజయం, సిద్ధరామయ్య ఓటమి

కర్నాటక ఎన్నికల్లోని గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఎవరైతే ఓడిపోయారో వారు భవిష్యత్తులో ఫైట్ బ్యాక్ చేయాలని ఆశించారు. కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి ముందుకు సాగితే ఫలితాలు వేరే విధంగా ఉండేవని అభిప్రాయపడ్డారు.

Karnataka results: Mamata Banerjee tweet

కర్ణాటకలో ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఏ పార్టీకి మెజారిటీ రాదని, హంగ్‌ తప్పదని ప్రీపోల్, ఎగ్జిట్‌ పోల్ సర్వేలు చెప్పాయి. కానీ రివర్స్ అయింది. ఆధిక్యంలో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటింది.

224 నియోజకవర్గాలున్న కర్ణాటకలో ఈ నెల పన్నెండున 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 113 సీట్లు దక్కించుకోవాలి. అయితే ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఫలితాలపై అందరిలోను ఆసక్తి కనిపించింది.

ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు నలభై స్థానాల వరకు వస్తాయని, కింగ్ మేకర్ అవుతుందని సర్వేలు చెప్పాయి. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే బీజేపీ 115 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 68 స్థానాల్లో గెలిచేలా ఉంది.

English summary
'Congratulations to the winners of the Karnataka elections. For those who lost, fight back. If Congress had gone into an alliance with the JD(S), the result would have been different. Very different' Mamata Banerjee tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X